బౌలర్ ఉమేశ్ యాదవ్, టీమిండియా అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మూడో టెస్టులో బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. నిజ జీవితంలో చేసిన ఆ ఒక్క పనితో ఆటపై తన కమిట్ మెంట్ ఏంటో చూపించాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయేలా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 109 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 186 పరుగుల వరకు బాగానే ఆడింది. కానీ అక్కడ నుంచి వరసగా వికెట్లు కోల్పోయింది. 197 రన్స్ చేసి ఆలౌటైపోయింది. ఇలా ఆసీస్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంలో ఆశ్విన్, ఉమేశ్ యాదవ్ కీలకపాత్ర పోషించారు. ఉమేశ్ వేసిన ఓ బంతికి అయితే వికెట్లు గాల్లో ఎగిరాయి. స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోయాడు. తాజాగా ఇతడి గురించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా పేస్ బౌలర్ గా ఉమేశ్ యాదవ్ క్రికెట్ చూసే చాలామందికి తెలుసు. 2010 నుంచి భారత జట్టుకు ఆడుతున్న ఇతడు.. ప్రస్తుతం మాత్రం టెస్టుల్లోనే కనిపిస్తున్నాడు. తాజాగా మూడో టెస్టుకు తనని తీసుకున్నందుకు పూర్తి న్యాయం చేశాడు. లోయరార్డర్ లోని గ్రీన్, స్టార్క్, మర్ఫీ వికెట్లు తీసి ఆస్ట్రేలియా తక్కువ పరుగులకు ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఉమేశ్ యాదవ్ తండ్రి మరణం. ఇప్పుడు దీని గురించే నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఎవరైనా తల్లిదండ్రులు మరణిస్తే.. ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. క్రికెటర్లు కూడా మనలాంటి మనుషులే కాబట్టి కచ్చితంగా వాళ్లు కూడా చాలా బాధపడతారు. ఉమేశ్ యాదవ్ తండ్రి చనిపోయి వారం రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆ దుఃఖాన్ని గుండెల్లో దిగమింగి మరీ మూడో టెస్టు ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసిన ఇతడు.. బౌలింగ్ లో 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఇతడిని చూసి నెటిజన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అతడి పట్టుదల చూసి శెభాష్ అంటున్నారు. మరి ఉమేశ్ యాదవ్ ఫెర్ఫార్మెన్స్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Umesh Yadav lost his father on February 23rd.
Umesh Yadav 17(13) & 3/12 on March 2nd.
Great commitment by Umesh Yadav, An inspiration. pic.twitter.com/CfYOWOP5Fj
— Johns. (@CricCrazyJohns) March 2, 2023
ICYMI – 𝟭𝟬𝟬𝘁𝗵 𝗧𝗲𝘀𝘁 𝘄𝗶𝗰𝗸𝗲𝘁 in India for @y_umesh 💪
What a ball that was from Umesh Yadav as he cleans up Mitchell Starc to grab his 100th Test wicket at home. #INDvAUS pic.twitter.com/AD0NIUbkGB
— BCCI (@BCCI) March 2, 2023