పిచ్ చూస్తే స్పిన్‌కు అనుకూలంగా ఉంది. పేసర్లు కేవలం స్పిన్నర్లకు అలసట వచ్చినప్పుడు ఓ నాలుగు ఓవర్లు వేసేందుకు మాత్రమే అన్నట్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమేష్ యాదవ్ సత్తా చాటాడు. తన పేస్‌తో భయపెట్టాడు. దాంతో పాటే ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుని, భారత దిగ్గజాల సరసన చేరిపోయాడు.
టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారిన ఉమేష్.. ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో చెలరేగాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై స్పిన్నర్లు చెలరేగుతున్న చోట ఊహించని రీతిలో తన పేస్ పవరేంటో చూపించాడు. 156 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియాను ఎక్కువసేపు ఆడనివ్వకుండా కేవలం 197 పరుగులకే ఆలౌట్ చేశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి 41 పరుగుల తేడాతో 6 వికెట్లను కూల్చారు. దీంతో భారీ లీడ్ ఆశించిన ఆస్ట్రేలియా.. 88 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా తొలి రోజు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రెండో రోజు అశ్విన్, ఉమేష్ యాదవ్ అతనికి అవకాశం ఇవ్వలేదు. మిగిలిన ఆరు వికెట్లను వాళ్లిద్దరూ చెరో మూడు పంచుకున్నారు.
మూడు వికెట్లతో సత్తా చాటిన ఉమేష్ యాదవ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టీమిండియా తరఫున టెస్టుల్లో 100కి పైగా వికెట్లు తీసిన ఐదో పేస్ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఉమేస్ యాదవ్ ఇండియాలో 100వ టెస్ట్ వికెట్ సాధించాడు. ఆ తర్వాత టాడ్ మర్ఫీని కూడా బౌల్డ్ చేయడంతో ఆ సంఖ్యను 101కి పెంచుకున్నాడు. కాగా.. ఉమేష్ కంటే ముందు.. దిగ్గజ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ టెస్టుల్లో ఇండియాలో 219 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత మరో దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ 108 వికెట్లతో, మూడు, నాలుగు స్థానాల్లో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ 104 వికెట్లతో ఉన్నారు. ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు ఉమేష్ యాదవ్ కూడా చేరిపోయాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అదే ఊపులో మూడో టెస్టులోనూ సత్తా చాటాలని భావించింది. ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఏ స్పిన్ ఆయుధంతో టీమిండియా, ఆస్ట్రేలియాను పడగొట్టలనుకుందో.. అదే స్పిన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేయడంతో తొలి రోజు వారిదే పైచేయిగా నిలిచింది. కానీ.. రెండో రోజు అశ్విన్, ఉమేష్ యాదవ్ చెలరేగడంతో 156 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్ కూడా పూర్తి కాకముందే 197 పరుగులకే ఆలౌట్ అయింది. మొత్తం మీద ఆసీస్‌కు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇండియా.. 15 పరుగుల వద్ద గిల్ వికెట్‌ను కోల్పోయింది. లంచ్ తర్వాత తొలి ఓవర్‌లోనే గిల్, లయన్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం రోహిత్, పుజారా క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Umesh Yadav – the underrated one! pic.twitter.com/amcZMmCS5h
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2023