టోక్యో ఒలంపిక్స్లో భాగంగా భారత షట్లర్ పీవీ సింధు శుభారంభం కొనసాగించారు. గ్రూప్-జే తోలి మ్యాచ్ లో ఇజ్రాయెల్ కు చెందిన పోలి కార్పోవాపై సింధు విజయం సాధించారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక మెల్ల మెల్లగా భారత అథ్లెటిక్స్ తమ విజయాలను నమోదు చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. ఇక ఇందులో భాగంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్, యశస్వినికి నిరాశ ఎదురైంది.
ఇక నిన్న వెయిట్ లిఫ్ట్ విభాగంలో మీరా బాయి చాను రజత పతకాన్ని అందించి భారత కీర్తి ప్రతిష్టను ఎగరవేసింది. మీరా బాయి చానుకి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఒలంపిక్స్ లో ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.