భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. సెమీస్ లో తిరుగులేని ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించిన ఆమె.. ఫైనల్ లో మరోసారి సత్తా చాటి.. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.
నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల ‘నిఖత్ జరీన్’ చూపిన పోరాటపటిమ అంతా ఇంతా కాదు. బౌట్లో ప్రత్యర్ధికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్లతో చెలరేగి ఏకపక్ష విజయాలను అందుకుంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను కొట్టుకుంటూ.. బలంతో, తెలివితో బోల్తా కొట్టిస్తూ రింగ్లో సివంగిలా కదులుతూ.. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించింది. 52 కేజీల విభాగంలో పసిడి పట్టేసింది. సెమీస్ లో 5-0 తేడాతో కరోలిన్ డి అల్మీదా (బ్రెజిల్)ను చిత్తుచిత్తుగా ఓడించిన జరీన్.. ఫైనల్ లో థాయ్‌లాండ్ బాక్సర్ జుటమస్ జిట్పంగ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. నిఖత్ జరీన్ మొదటి రౌండ్‌లో తిరుగులేని ఆధిక్యం దక్కించుకుంది. రెండో రౌండ్‌లో ఇద్దరికీ సమానమైన పాయింట్లు లభించాయి. ఇక.. చివరి రౌండ్‌లో నిఖత్ జరీన్ చెలరేగి ఆడింది. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. జరీన్ దూకుడు ముందు ప్రత్యర్థి బాక్సర్ నిలవలేకపోయింది. ఈ విజయంతో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 6వ స్వర్ణాన్ని అందించింది. మొత్తంగా ఐదవ క్రీడాకారిణి కాగా మేరీ కోమ్, సరితా దేవీ, జెన్నీ ఆర్‌ఎల్, లేఖ కేసీ వంటి దిగ్గజ బాక్సర్ల సరసన నిలిచింది.
🚨 BREAKING: @nikhat_zareen wins gold at the Women’s Boxing World Championships in Turkey.
She becomes India’s fifth gold medallist in the history of the tournament, joining a club featuring Mary Kom, Sarita Devi, Jenny RL and Lekha KC. #IBAWWC2022 | #BoxingNews pic.twitter.com/hljjcAaUKR
— Sportstar (@sportstarweb) May 19, 2022