‘టీమిండియా టూర్ ఆఫ్ సౌతాఫ్రికా 2021-22’లో టీమిండియాకు గట్టి షాకే తగిలింది. సెంచూరియన్ లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించిన టీమిండియాకు ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఐసీసీ షాకిచ్చింది. మొదటి టెస్టులో టీమిండియా స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని మ్యాచ్ ఫీజులో కోత విధించింది. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదని వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించనున్నట్లు వెల్లడించింది.
Scenes from Centurion 👌https://t.co/Z3MPyesSeZ goes behind the scenes post #TeamIndia‘s historic win at SuperSport Park 🏟️🙌
Full video coming up soon 📽️ – Stay tuned ⏳#SAvIND pic.twitter.com/oKyGhm0MxF
— BCCI (@BCCI) December 30, 2021
ఈ కోత మ్యాచ్ ఫీజుతో మాత్రమే ఆగదు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2022-23 పాయింట్స్ లోనూ కోత పడనుంది. ఆర్టికల్ 16.11 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2022-23లో ఒక పాయింట్ కోత తప్పదు. మ్యాచ్ ఫీజులో కోత కేవలం ఆటగాళ్లకే కాదు.. సహాయక సిబ్బంది మ్యాచ్ ఫీజులోనూ 20 శాతం కోత పడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2022- 23 పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. జనవరి 3 నుంచి జోహెన్స్ బర్గ్ వేదికగా టీమిండియా- సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడనుంది.
India have been fined 20% of their match fee for maintaining a slow over-rate against South Africa in the first Test held in Centurion: ICC pic.twitter.com/YYVmis00tN
— ANI (@ANI) December 31, 2021