‘ఐపీఎల్ 2022’ సందడి మొదలైపోయింది. నవంబర్ 30 కల్లా ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల వివరాలు అందించాలి. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు పెద్ద ధర్మ సంకటమే వచ్చిపడింది. డేవిడ్ వార్నర్ ను తీసుకునే ఉద్దేశం యాజమాన్యానికి లేదు. కేన్ మామను రిటైన్ చేసుకునేందుకు ఫిక్స్ అయిపోయారు. అందుకు కేన్ కూడా ఓకే అనేశాడు. రెండో విదేశీ ప్లేయర్ గా రషీద్ ఖాన్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అఫ్గనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు హైదరాబాద్ టీమ్ తో మంచి అనుబంధమే ఉంది. హైదరాబాద్ తరఫున రషీద్ ప్రతి సీజన్ చాలా ఉత్తమ ప్రదర్శన చేశాడు. అంతేకాదు క్రికెట్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే సన్ రైజర్స్ రషీద్ ఖాన్ను రిటైన్ చేసుకోవాలని సంప్రదింపులు చేస్తోంది. ప్రస్తుతం రూ.9 కోట్లు ఇస్తుండగా ఇప్పుడు రెండో రిటైన్ కింద రూ.12 కోట్లకు రషీద్ ఖాన్ ను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు అతను ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. అతడికి అది సరిపోదని లేదంటే రిలీజ్ చేయాలంటూ పట్టుబట్టినట్లు సమాచారం. మొదటి రిటైన్ కు రూ.16 కోట్లు రెండో రిటైన్ ప్లేయర్ కు రూ.12 కోట్లు చెల్లించాలి. అంతకు మించి చెల్లించేందుకు అవకాశం లేదు. అయితే రషీద్ ఖాన్ తననే మొదటి రిటైన్ ప్లేయర్ తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆక్షన్ కు వెళితే అంతకన్నా ఎక్కువే వస్తాయని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే వార్నర్ లాంటి ప్లేయర్ ను పోగొట్టుకుని ఇప్పుడు రషీద్ ఖాన్ ను కూడా వదులుకుంటే హైదరాబాద్ టీమ్ పెద్ద చిక్కుల్లో పడినట్లే. రషీద్ ఖాన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.