క్రికెట్ ప్రపంచానికి "బజ్ బాల్" అంటూ ఇంగ్లాండ్ టెస్టుల మీద కూడా ఆసక్తి కలిగేలా చేస్తుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్ తనదైన శైలిలో స్పందిస్తూ భారత్ ని ఈ విషయంలోకి లాగాడు.
“బజ్ బాల్” అంటూ టెస్టుల్లో ఇంగ్లాండ్ కొత్త సంప్రదాయం మొదలు పెట్టి అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫార్ములా అన్ని జట్లు మీద వర్కౌట్ అయినా.. పట్టిష్టమైన ఆసీస్ మీద ఈ వ్యూహం బెడిసి కొట్టిందనే చెప్పాలి. మొదటి రెండు టెస్టుల్లో బజ్ బాల్ అంటూ యాషెస్ లో ఇంగ్లీష్ టీం చేతులు కాల్చుకుంది. తాజాగా లీడ్స్ లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచినా.. బౌలర్లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు బజ్ బాల్ పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా టీమిండియాని తక్కువగా చేసి మాట్లాడం ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు.
క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటాడు లిటిల్ మాస్టర్. టీమిండియా మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచడమే కాదు బాగా ఆడకపోతే క్లాస్ పీకడానికి రెడీ గా ఉంటాడు. ఇటీవలే ఆస్ట్రేలియా మీద డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీమిండియా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సునీల్ గవాస్కర్ అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా టీమిండియాని విమర్శిస్తూనే ఉన్నాడు. ఇక బజ్ బాల్ సంగతి మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్, న్యూజీలాండ్ లాంటి బలహీన జట్లతో ఆదుకోండి అని ఘాటుగానే విమర్శించాడు. ఇందులో భారత్ పేరు కూడా ఉండడం షాకింగ్ గా అనిపించింది.
“బాజ్‌బాల్ గురించి ఆలోచించడం అనవసరం. నాణ్యమైన బౌలింగ్ లేని జట్లపైనే ఈ రూల్ వర్కౌట్ అవుతుంది. గతంలో చూసుకుంటే న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై ఇంగ్లండ్ బాజ్‌బాల్‌ను నమ్ముకొనే విజయాలు నమోదు చేసింది. టీమిండియాకు కూడా బౌలింగ్ బలహీనంగా ఉంది. కానీ ఆసీస్ ముందు ఈ పద్ధతి బెడిసికొట్టింది. ఈ బౌలింగ్ ఎదుర్కోవాలంటే సంప్రదాయ బద్ధంగా సుదీర్ఘ సమయం క్రీజులో బ్యాటింగ్ చేయకతప్పదు. టీ20 షాట్లు ఆడతానంటే కుదరదు. ఎంతైనా టెస్టు క్రికెట్ అంటే.. టెస్టు క్రికెటే కదా” అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి బలహీనంగా ఉన్న జట్లలో భారత్ ని కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.