బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లోనూ స్టీవ్ స్మిత్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. దాంతో తన కెరీర్ లోనే అత్యంత చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు స్మిత్. గత ఆరు ఇన్నింగ్స్ ల్లో స్మిత్ చేసిన పరుగులు చూస్తే.. అతడు ఏ రేంజ్ లో విఫలం అవుతున్నాడో తెలుస్తుంది.
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆసిస్ మధ్య చివరిదైన, కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు ఆసిస్ బ్యాటర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ సెంచరీతో చెలరేగాడు.. కామెరూన్ గ్రీన్ (49) పరుగులతో అతడికి అండగా నిలబడ్డాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసిస్ కెప్టెన్ స్మిత్ 38 పరుగులకే మరోసారి జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దాంతో ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు స్మిత్. మూడో టెస్ట్ లో కెప్టెన్ గా హిట్ అయిన స్మిత్.. బ్యాటింగ్ లో మాత్రం విఫలం అవుతూనే ఉన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన నాలుగో టెస్ట్ గురువారం ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ ఆరంభించిన ఆసిస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్-ఉస్మాన్ ఖవాజాలు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే ఈ క్రమంలోనే 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసి ఇండియాకు బ్రేక్ త్రూ అందించాడు. ఆ వెంటనే స్టార్ బ్యాట్స్ మెన్ లబూషేన్(3) ను షమీ బౌల్డ్ చేసి ఆసిస్ ను దెబ్బకొట్టాడు.
ఈ క్రమంలోనే క్రీజ్ లోకి వచ్చాడు ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఖవాజాకు జతకలిసిన స్మిత్.. ఆసిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీశాడు జడేజా. ఇన్నింగ్స్ 63వ ఓవర్ 4వ బంతికి స్మిత్ (38) ను బౌల్డ్ చేయడం ద్వారా వీరి 79 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా స్మిత్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యి.. తన కెరీర్ లో చెత్త రికార్డును నెలకొల్పుకున్నాడు. ఈ సిరీస్ లో స్మిత్ మూడు టెస్టుల్లో వరుసగా.. 37, 25*, 0, 9, 26, 38 పరుగులు సాధించాడు.
దాంతో తన కెరీర్ లో తొలిసారి వరుసగా ఆరు ఇన్నింగ్స్ ల్లో ఒక్క అర్దశతకం కూడా కొట్టలేదు. ఇదే స్మిత్ కెరీర్ లో చెత్త రికార్డు అంటున్నారు ఆసిస్ అభిమానులు. అయితే మూడో టెస్ట్ లో తన అద్భుతమైన కెప్టెన్సీతో ఆసిస్ కు విజయాన్ని అందించాడు స్మిత్. సారథిగా హిట్ కొట్టినప్పటికీ.. బ్యాటర్ గా మాత్రం విఫలం అవుతూనే ఉన్నాడు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ కు ఘనమైన రికార్డే ఉంది. బ్యాటర్ గా టెస్ట్ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు స్మిత్. అయితే భారత బౌలర్ల ముందు మాత్రం తన బ్యాటింగ్ పారడం లేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆసిస్ 4 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ సెంచరీతో చెలరేగాడు. 251 బంతుల్లో 15 ఫోర్లతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి అండగా క్రీజ్ లో ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(49) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజాలు తలా ఓ వికెట్ తీశారు.
Steve Smith!#INDvAUS pic.twitter.com/iSOikxk4Rk
— RVCJ Media (@RVCJ_FB) March 9, 2023