తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఇటీవలే జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారి టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. రేపు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దాదాపు తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సందర్భమగా భరత్ మాట్లాడుతూ ధోని సలహాలు ఫైనల్లో పాటిస్తానని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ డబ్ల్యూటీసీ ఫైనల్. భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జరిగే ఈ టెస్టు మ్యాచ్ రేపు (జూన్ 7) ప్రారంభం. లండన్ లోని ఒవెల్ ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా.. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా భారత్ మాజీ కెప్టెన్ మాహేంద్ర సింగ్ ధోని.. తనతో మాట్లాడడని.. కొన్ని సలహాలు కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. మరి భరత్ కి.. ధోని ఏం సలహాలు చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఇటీవలే జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలిసారి టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. రోడ్ యాక్సిడెంట్ లో పంత్ అనూహ్యంగా గాయపడడంతో అదృష్టవశాత్తు టీంఇండియాలో స్థానం సంపాదించిన భరత్..పెద్దగా ప్రభావం చూపించలేదు. అయినా సరే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనికి అవకాశం లభించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ లో భరత్ ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దిగ్గజాలు కిషాన్ వైపు మొగ్గు చూపుతున్నా.. భరత్ కి తుది జట్టులో స్థానం దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. తొలిసారి ఈ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న భరత్.. తన మ్యాచులో ధోని చెప్పిన సీక్రెట్ గ్రౌండ్ లో అమలు చేస్తానని చెప్పుకొచ్చాడు.
భరత్ మాట్లాడుతూ.. “ధోనీ సలహాతో ఇంగ్లండ్ పరిస్థితులకు ఎలా అలవాటు పడాలి? వికెట్ కీపర్లకు ఇక్కడ ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఈ విషయం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో నా బెస్ట్ వికెట్ కీపర్ ధోనీనే. ధోనీకి ఉండే స్పృహ, కీపర్‌గా తను వేసే ప్లాన్స్ సూపర్‌గా ఉంటాయి. కీపర్‌గా ఉండాలంటే ఇంటెంట్, ప్యాషన్ ఉండాల్సిందే. ఎందుకంటే కీపింగ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదొక థ్యాంక్‌లెస్ జాబ్. టెస్టుల్లో అయితే ఏకంగా 90 ఓవర్లు కీపింగ్ చేయాలి. ప్రతి బంతి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈ సవాళ్లను స్వీకరించి, జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. లేదంటే చాలా కష్టం’ అని భరత్ వివరించాడు. మొత్తనికి ధోని సలహాలు భరత్ కి ఏ విధంగా సహాయపడతాయో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.