రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంక లెజెండ్స్-ఇంగ్లాండ్ లెజెండ్స్ కాన్పూర్ వేదిక గా తలపడ్డాయి. ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ 7వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ లెజెండ్స్ ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక దిగ్గజం జయసూర్య తన మణికట్టుతో మాయ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను పేకమేడలా కూల్చాడు. జయసూర్య బౌలింగ్ మాయతో ఏదశలోనూ ఇంగ్లాండ్ లెజెండ్స్ మ్యాచ్ పై పట్టు సాధించలేదు. ఇప్పటికే ఈ సిరీస్ లో విజయం సాధించి దూసుకెళ్తున్న లంక లెజెండ్స్ కు మరో విజయం దక్కింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ 2022 టైటిల్ గెలిచి ఆనందంలో ఉన్న శ్రీలంక అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది శ్రీలంక లెజెండ్స్ జట్టు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 లో భాగంగా జరిగిన తాజాగా జరిగిన మ్యాచ్ లో క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ను ఓడించింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. శ్రీలంక లెజెండ్స్ టాస్ గెలిచి మెుదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ లెజెండ్స్ జయసూర్య మాయాజాలానికి 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలారు. బ్యాటర్లు ఇలా క్రీజ్ లోకి వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఇక ఇంగ్లాండ్ లెజెండ్స్ ఓపెనర్ మాస్టర్డ్ (14) ను అవుట్ చేయడం ద్వారా ఇర్సు ఉదన ఇంగ్లాండ్ లెజెండ్స్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ పవర్ ప్లే ముగిసే సరికి 25/1గా ఉంది. లంక లెజెండ్స్ బౌలర్లు ప్రత్యర్దికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లాండ్ లెజెండ్స్ కెప్టెన్ బెల్(15), మ్యాడి(2), అంబ్రోస్(0), మస్కరేనస్(1), లోయే(8), క్లర్క్(9), ట్రెమ్లెట్(3), ప్యారీ(10), మేకర్(0)లు తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్టు 78 రన్స్ కే ఆలౌట్ అయ్యింది.
శ్రీలంక లెజెండ్ బౌలర్ సనత్ జయసూర్య అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన అతడు 2 మెయిడిన్ల తో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కులశేఖర, డి సిల్వా తలా 2 రెండు వికెట్లు తీయగా.. ఉదన, మెండిస్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక లెజెండ్స్ కూడా ఇన్నింగ్స్ ను నెమ్మదిగానే ప్రారంభించారు. అయినప్పటికీ 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసి విజయాన్ని సాధించారు. ఇక గత మ్యాచ్ సెంచరీ హీరో తిలకరత్నే దిల్షాన్ ఈ మ్యాచ్ లో 15 రన్స్ చేసి వెను దిరిగాడు. లంక ఇన్నింగ్స్ లో మునవీర 43 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి అండగా మరో బ్యాటర్ ఉపుల్ తరంగా 19 బంతుల్లో 23 పరుగులు చేసి తో లంకకు విజయాన్ని అందించాడు. జీవన్ మెండిస్ (8) పరుగులు, చమర సిల్వా (0) రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ లెజెండ్స్ బౌలర్లలో ప్యారీ, స్కోఫీల్డ్, మస్కరేనస్ తలా 1వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సనత్ జయసూర్య అందుకున్నాడు.
సనత్ జయసూర్య.. శ్రీలంక డ్యాషింగ్ బ్యాట్స్ మెన్. అలవోకగా సిక్స్ లు కొట్టడంలో సిద్దహస్తుడు అని అతడికి పేరుంది. అదీ కాక అతడు మంచి బౌలర్ అని కూడా మనకి తెలుసు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో తన స్పిన్ మాయతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన బంతులతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. జయసూర్య బౌలింగ్ కు వచ్చే టైమ్ కు ఇంగ్లాండ్ 8 ఓవర్లలో 34/1 ఉంది. ఎప్పుడైతే జయసూర్య బౌలింగ్ లోకి ఎంటర్ అయ్యాడో మ్యాచ్ స్వరూపమే మారి పోయింది. తన మెుదటి ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక రెండో ఓవర్లో పరుగులు ఏమీ ఇవ్వకుండానే అంబ్రోస్, మ్యాడిని అవుట్ చేశాడు. ఇక 3వ ఓవర్లో కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చి మస్కరేనస్ ను బోల్తా కొట్టించాడు. తన చివరి ఓవర్లో కూడా 1 పరుగే ఇచ్చి లోయే ని పెవీలియన్ కు పంపాడు. జయసూర్య దెబ్బకి ఇంగ్లాండ్ లెజెండ్స్ 14 ఓవర్లో 47/7 కు చేరింది. మరి శ్రీలంక లెజెండ్స్ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sanath Jayasuriya has been awarded as player of the match for his brilliant spell against England Legends.#CricTracker #ENGLvSLL #RoadSafetyWorldSeriesT20 #SanathJayasuriya pic.twitter.com/GOtyf0E4pS
— CricTracker (@Cricketracker) September 13, 2022
A comprehensive victory for Sri Lanka Legends in their second game against England Legends.
📸: Voot#CricTracker #ENGLvSLL #RoadSafetyWorldSeriesT20 pic.twitter.com/AWQvJdQNz0
— CricTracker (@Cricketracker) September 13, 2022