క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు, బాల్ బాల్ కు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే చివరి దాక ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురౌతుంటాయి. ఇక జట్టు కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో చివర్లో అద్భుతాలు జరిగి ఆ జట్టు ఓడిపోవచ్చు. అచ్చం అలాంటి అద్భుతమైన మ్యాచే తాజాగా జరిగింది. సౌతాఫ్రికా వేదికగా జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. మంగౌంగ్ ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో చేజేతులా ఓడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ జట్టు స్థానంలో కెన్యా జట్టు ఉన్నా గానీ ఈజీగా గెలిచేది అని క్రికెట్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్-సౌతాఫ్రికా రెండు జట్లూ తాజాగా జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కు ముందు పాకిస్థాన్ ను మట్టికరిపించిన జట్లే. దాంతో అదే జోరును కొనసాగించాలని ఇరు జట్లు భావించాయి. ఈ క్రమంలోనే మంగౌంగ్ ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిధ్య సౌతాఫ్రికా టీమ్ 27 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కచ్చితంగా గెలవాల్సింది. కానీ మిడిలార్డర్ బ్యాటర్స్ చేతులెత్తేయడంతో పరాభవాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. ఓపెనర్లు డి కాక్ (37), కెప్టెన్ బవుమా(36)లు తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మెుయిన్ అలీ విడదీశాడు. దాంతో కెప్టెన్ బవుమా తొలి వికెట్ గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజ్ లోకి వచ్చిన వాన్ డర్ డస్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించి శతకంతో కదం తొక్కాడు. 117 బంతులు ఎదుర్కొన్న డస్సెన్ 6 ఫోర్లు, సిక్స్ తో 111 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. మిగతా బ్యాటర్లు అయినా మార్క్రమ్(13), క్లాసెన్(30) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ మిల్లర్ (53) అర్దశతకంతో రాణించాడు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 299 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు జెసన్ రాయ్-డేవిడ్ మలన్ లు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
𝐀𝐧𝐚𝐬 𝐓𝐨 𝐓𝐡𝐞 𝐑𝐞𝐬𝐜𝐮𝐞 🔥
Anrich Nortje pioneered an epic, come-from-behind win for South Africa against a quality 🏴 side 👏🏽#SAvENG pic.twitter.com/m1oINV2A81
— Delhi Capitals (@DelhiCapitals) January 28, 2023
వీరిద్దరి జోరును చూస్తుంటే.. వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదిస్తారా అన్న అనుమానం కూడా కలిగింది. తొలి వికెట్ కు కేవలం 19.3 ఓవర్లలోనే 146 పరుగులు జోడించి విజయానికి గట్టి పునాదిని వేశారు రాయ్-మలన్ లు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీయడానికి ప్రోటీస్ బౌలర్లు తెగ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి మగల బౌలింగ్ లో బవుమాకు క్యాచ్ ఇచ్చి 59 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ అయ్యాడు డేవిడ్ మలన్. అనంతరం సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్లు అయిన బెన్ డకెట్(3), హ్యారీ బ్రూక్స్(0) విఫలం అయ్యారు. దాంతో 196 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. ఒకవైపు వికెట్లు పడుతున్నా గానీ ఒంటరి పోరాటం చేశాడు జెసన్ రాయ్. 91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి, నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు.
ఇక ఆదుకుంటాడు అనుకున్న మెుయిన్ అలీ(11) కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖాయం అయ్యింది. ఒకానొక దశలో చాలా ఈజీగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుస్తుందని మ్యాచ్ చూసే అభిమానులందరు అనుకున్నారు. కానీ మ్యాచ్ మధ్యలో అద్భుతంగా పుంజుకున్నారు ప్రోటీస్ బౌలర్లు. క్రమంగా వికెట్లు తీస్తూ.. మ్యాచ్ పై పట్టు సాధించారు. దాంతో 44.2 ఓవర్లలో 271 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్రిచ్ నోర్ట్జే 4 వికెట్లు తీయగా.. సిసండా మగలా 3 వికెట్లతో రాణించాడు. 27 పరుగుల తేడాతో గెలిచే మ్యాచ్ లో ఓటమి పాలైంది టీ20 ఛాంపియన్స్ జట్టు. కావాల్సిన పరుగులు 27, చేతిలో ఇంకా 5 ఓవర్లు ఒక్క బ్యాటర్ క్రీజ్ లో నిలబడినా గానీ ఇంగ్లాండ్ గెలిచేదే. అసలు ఇలాంటి స్థితిలో పసికూన కెన్యా జట్టు ఉన్నా గానీ విజయం సాధించేదే అని క్రికెట్ పండితులు, సగటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి గెలిచే మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fourth ODI ton for Rassie van der Dussen 🙌#SAvENG | 📝 Scorecard: https://t.co/DlhKB8Imxl pic.twitter.com/Hoj5s5AXT8
— ICC (@ICC) January 27, 2023