సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్రను మార్చిన గొప్ప ఆటగాడు. ఇక గంగూలీ ఆటకు, బ్యాటింగ్ స్టైల్ కు కోట్లలో అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సేమ్ టూ సేమ్.. దాదాను గుర్తు చేస్తోంది టీమిండియా స్టార్ స్మృతి మంధన..
ప్రస్తుతం టీమిండియా వుమెన్స్ జట్టు టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ కు దూసుకెళ్లింది. ఇక భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధన తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ కు దూరంగా ఉన్న స్మృతి.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అర్ద సెంచరీలతో చెలరేగింది. మరీ ముఖ్యంగా ఐర్లాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో తన విశ్వరూపాన్నే చూపింది స్మృతి. 56 బంతుల్లోనే 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో మంధన కొట్టిన ఫుల్ షాట్స్, కవర్ డ్రైవ్, లాప్టడ్ ఆఫ్ డ్రైవ్స్ తో అభిమానులను అలరించింది. దాంతో తాజాగ స్మృతి మంధన ఆటను టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆటతో పోలుస్తూ.. ఐసీసీ ఓ వీడియోను షేర్ చేసింది.
సౌరవ్ గంగూలీ.. టీమిండియా క్రికెట్ చరిత్రనే మార్చిన గొప్ప యోధుడు. ఇక గంగూలీ ఆటకు, బ్యాటింగ్ స్టైల్ కు అభిమానులు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా దాదా ముందుకు వచ్చి కొట్టే ఫ్రంట్ ఫుట్ సిక్సర్ కు ప్రత్యేక అభిమానులే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధన.. దాదా షాట్స్ ను గుర్తు చేసింది. సేమ్ టూ సేమ్ అచ్చుగుద్దినట్లు గంగూలీని తలపించింది. ఆఫ్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, స్ట్రెయిట్ షాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నింట్లోనూ గంగూలీ స్టైల్ ను గుర్తు చేసింది ఈ స్టార్ బ్యాటర్.
ఈ క్రమంలోనే దాదా-స్మృతి షాట్లను పోలుస్తూ.. ఐసీసీ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే మతిపోతోంది అని రాసుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు స్మృతిని లేడీ దాదా అంటూ పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఇక టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా పటిష్టమైన ఆసిస్ ను ఢీ కొనబోతోంది. ఆసిస్ పై గెలిస్తే కచ్చితంగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది అనడంలో సందేహం లేదని అంటున్నారు అభిమానులు. మరి తనదైన క్రికెట్ షాట్స్ తో సౌరవ్ గంగూలీని గుర్తు చేసిన స్మృతి మంధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.