బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్ పూర్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు మూడో సెషన్ సమయానికే ఆలౌట్ అయ్యింది. రీఎంట్రీ తర్వాత జడేజా చెలరేగాడు. కోలుకున్న తర్వాత తొలి టెస్టులోనే మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. అశ్విన్ కూడా 3 వికెట్లతో ఇరగదీశాడు. షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఆటగాళ్లను పక్కన పెడితే కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అందుకు సంబంధించిన పిక్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్- ఉస్మాన్ ఖవాజా ఓపెనింగ్ చేశారు. అయితే మొదటి ఓవర్ సిరాజ్ బౌల్ చేశాడు. తర్వాత సిరాజ్ యాక్షన్ లోకి వచ్చాడు. బంతి అందుకున్న తొలి ఓవర్లోనే సిరాజ్ మొదటి బంతికి అద్భుతం చేశాడు. సిరాజ్ వేసిన బంతిని ఖవాజా అడ్డుకోలేకపోయాడు. బాల్ నేరుగా అతని పాడ్స్ కి తాకింది. టీమ్ మొత్తం ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అనడంతో.. రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కు వెళ్లాడు. కామెంటరీ కూడా అది నాటౌట్ అని భావించారు. తర్వాత రివ్యూలో ఖవాజా అవుట్ అని తేలింది. వేసిన మొదటి బంతికే సిరాజ్ కు వికెట్ దక్కడంపై టీమ్ మొత్తం సంబరాలు చసుకుంది.
𝑰. 𝑪. 𝒀. 𝑴. 𝑰!
1⃣ wicket for @mdsirajofficial 👌
1⃣ wicket for @MdShami11 👍Relive #TeamIndia‘s early strikes with the ball 🎥 🔽 #INDvAUS | @mastercardindia pic.twitter.com/K5kkNkqa7U
— BCCI (@BCCI) February 9, 2023
మైదానంలో ఉన్న జట్టు చేసుకున్న సంబరాలు కంటే కూడా బయట ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎక్స్ ప్రెషన్ ఇప్పుడు ఎక్కవ వైరల్ అవుతోంది. సిరాజ్ కు వికెట్ అని తెలియగానే ద్రవిడ్ ఎంతో ఆనందంగా కనిపించాడు. ఎస్ ఎస్ అన్నట్లు గాల్లోకి పంచులు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. సిరాజ్ కు వికెట్ దక్కడం, రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా అవుట్ కావడంతో ద్రవిడ్ ఎంతో ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. 3 టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్ లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేస్తే తొలి టెస్టులో భారత్ గెలవడం సునాయాసమనే చెప్పాలి.
Rahul Dravid is pumped up. pic.twitter.com/x6M8hrM0EZ
— Johns. (@CricCrazyJohns) February 9, 2023