ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామాకు కారణం కూడా కటిచ్ వెల్లడించాడు. ఇటివల బెంగుళూరు వేదికగా జరిగని ఐపీఎల్ మెగా వేలంలో SRH ఫ్రాంచైజ్ యజమాని కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆరోపిస్తూ కటిచ్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన సైమన్ కటిచ్ గతంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు. నిజానికి సన్‌రైజర్స్ జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. జట్టు సరిగా లేదని SRH ఫ్యాన్స్ కూడా అసంతృత్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా జట్టు బాగాలేదని, కావ్య సరైన జట్టును ఎంపిక చేయలేదని అసిస్టెంట్ కోచ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. మరి సైమన్ కటిచ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SRH జట్టు..
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబాట్, శశాంక్ సింగ్, సౌరభ్ దూబే, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్‌రామ్, ఫజల్హాక్ ఫరూకీ, టీ. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్.