బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఇండియా తొలి టెస్టు గెలిచి జోష్ మీద ఉంది. ఆస్ట్రేలియా పరాజయంతో అవమాన భారంతో ఉంది. ఈ టైమ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలు ఆసీస్‌కు పుండుమీద కారం చల్లినట్లు ఉన్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో అయితే కనీసం 100 పరుగుల మార్క్ ని కూడా అందుకోలేక చతికిలపడింది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబు షేన్ లాంటి అగ్ర శ్రేణి బ్యాటర్లు ఉండి కూడా ఆసీస్ ఇంత పేలవంగా ఆడడం ఆ దేశ క్రికెట్ బోర్డును తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్ల ఆస్ట్రేలియా జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ దిగ్గజాలు అలెన్ బోర్డర్, మార్క్ వా తమదైన శైలిలో ఆస్ట్రేలియా టీమ్ మీద విరుచుకుపడ్డారు. తాజాగా న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ ఖాయమని అని జోస్యం చెప్పాడు.
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ వ్యాఖ్యలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. డౌల్ మాట్లాడుతూ “ఆస్ట్రేలియాను భారత్ వైట్ వాష్ చేయడం ఖాయం. అందులో అనుమానం కూడా లేదు. వర్షం కనుక అంతరాయం కలిగించకుంటే భారత్ ఈ సిరీస్ 4-0తో కైవసం చేసుకుంటుంది. ఒకవేళ స్టీవ్ స్మిత్, లబుషెన్ పోరాటంతో ఒక టెస్టు గెలిచినా.. భారత్ 3-1 తేడాతో అయినా సిరీస్ గెలవడం ఖాయం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0 లేదా 3-1 తో గెలుచుకుంటుంది”. అని అన్నాడు.
ఇదే సందర్భంగా భారత్ పిచ్ లను తమకు అనుకూలంగా తయారుచేసుకుంటున్నారు అనే విషయంపై కూడా వివరణ ఇచ్చాడు. స్వదేశంలో ఏ టీం అయినా పిచ్ లను వారికి అనుకూలంగా తయారు చేసుకోవడం సాధారణమే. ఇందులో పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా రెండో టెస్టు గెలిచి భారత్ ఆధిక్యాన్ని 1-1 తో సమం చేయాలనుకుంటుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టులో ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రెండో టెస్టులో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే బ్యాటర్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Simon Doull : I would be surprised if Australia win even one without rain it will be 4-0 to India.
— Crickdom (@Crickdom7) February 15, 2023