బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అదృష్టం టీమిండియా జేబులో ఉన్నట్లు అనిపిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే తొలి సారి బెయిల్స్ పైకి లేచి.. మళ్లీ వికెట్లపైనే అంచున ఉండిపోయాయి. గతంలోనూ బాల్ వికెట్లను తాకినా.. బెయిల్స్ కిందపడలేదని అంపైర్లు అవుట్ ఇవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. బాల్ వికెట్లను తాకిన విషయం రివ్యూలో కాకుండా నార్మల్‌గా చూసినా తెలిసిపోయింది. పైగా వికెట్లకు ఉండే లైట్లు మిళమిళమంటూ మెరిసిపోయాయి. స్టంప్స్‌పైన ఉండే బెయిల్స్ పైకి లేచి కాస్త పక్కకు ఒరిగాయి. పైగా అది నోబాల్ కూడా కాదు. అయినా.. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ.. బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం తనకు వికెట్ దక్కిందని సంబురాలు మొదలుపెట్టాడు.
కానీ.. బ్యాటర్ క్రీజ్ వదలకపోవడం, అంపైర్ కూడా నాటౌట్ అనడంతో బౌలర్ షాక్ అయ్యాడు. అతనితో పాటు బంగ్లాదేశ్ టీమ్ మొత్తం ఆశ్చర్యపోయి.. వికెట్ చుట్టూ గుమ్మిగూడి ఇదేం వింత అన్నట్లు చూశారు. ఆ అవుట్ నుంచి బతికిపోయిన శ్రేయస్ అయ్యర్, నాన్ స్ట్రైకర్‌లో ఉన్న పుజారా.. ముసిముసి నవ్వులు చిందించారు. ఈ విచిత్రమైన సంఘటన ఇబాదత్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఐదో బంతి ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ పూర్తిగా మిస్ అయ్యాడు. అదినేరుగా వెళ్లి వికెట్లను తాకింది. కానీ.. బెయిల్స్ కింద పడలేదు. లైట్లు వెలిగినా.. అంపైర్ దాన్ని అవుట్ ఇవ్వలేదు. దీంతో శ్రేయస్ అయ్యర్ 77 పరుగుల వద్ద అవుట్ కాకుండా బతికిపోయాడు. మరో విశేషం ఏమిటంటే.. ఆ బెయిల్‌ను అంతకు రెండు బాల్స్ ముందే మార్చారు. అంతకు ముందు ఉన్న బెయిల్ లైట్ వెలగటం లేదని.. దాని స్థానంలో కొత్త బెయిల్‌ను పెట్టారు. అదే బంగ్లాదేశ్ కొంపముంచింది.
అయితే.. దీన్ని అవుట్ ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా.. బెయిల్స్ కచ్చితంగా కిందపడాలనే నిబంధనతో బౌలర్లకు, బౌలింగ్ టీమ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అంత క్లియర్‌గా బాల్ వికెట్లకు తగిలినా, లైట్లు వెలిగినా, బెయిల్స్ పక్కకు ఒరిగినా.. అవుట్ ఇవ్వకపోవడం దారుణమంటున్నారు. ఈ నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే చివరి బంతికి అక్షర్ పటేల్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే.. టీమిండియా ఆరంభంలో తడబడింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(20), కేఎల్ రాహుల్(22), విరాట్ కోహ్లీ(1) వెంటవెంటనే అవుట్ అవ్వడంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పుజారాతో కలిసి పంత్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేసి పంత్ మెహిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. పుజారాతో జతకలిసిన శ్రేయస్ అయ్యర్ 149 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను గాడిలో పెట్టాడు. అయితే.. టీ బ్రేక్ తర్వాత 90 పరుగులు చేసి పుజారా తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అక్షర్ పటేల్‌ను మెహిదీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్‌కు 3, మెహిదీకి 2, ఖలీద్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. మరి శ్రేయస్ అయ్యర్‌కు దక్కిన లక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#BANvIND | 1st Test | LIVE UPDATES: An incredible sequence of play in the Test match as Shreyas Iyer is bowled by Ebadot Hossain but 𝗯𝗮𝗶𝗹𝘀 𝗿𝗲𝗳𝘂𝘀𝗲 𝘁𝗼 𝗳𝗮𝗹𝗹 🤯
(🎥: Sony Sports Network)#BANvsIND | #INDvBAN | #INDvsBAN | #ShreyasIyer pic.twitter.com/W9lEEJKozD
— Cricket Buzz (@CricSportsBuzz) December 14, 2022