సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సాంగ్ కు తన సోదరితో కలిసి డ్యాన్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్. తనదైన డ్యాన్స్ స్కిల్స్ తో మరోసారి అలరించాడు ఈ యంగ్ ప్లేయర్.
నేటి సోషల్ మీడియా యుగంలో రోజుకో పాట ట్రెండింగ్ లోకి వస్తుంటుంది. దాంతో ఏ ఇన్ స్టాగ్రామ్ రీల్ చూసినా గానీ ఆ పాటే మనకు వినిపిస్తుంటుంది. సాధారణ వ్యక్తులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ఆ పాటకు స్టెప్పులు వేస్తూ.. అభిమానులను అరిస్తుంటారు. తాజాగా ఓ టీమిండియా స్టార్ బ్యాటర్ సైతం ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ సాంగ్ అయిన ‘మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్’ అన్న సాంగ్ కు తన సోదరితో కలిసి స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకి చెల్లితో డ్యాన్స్ చేసిన ఆ భారత క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం పదండి.
గత కొంతకాలంగా టీమిండియా కంటిన్యూస్ గా పరుగులు చేస్తూ.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఇక అయ్యర్ డ్యాన్స్ ఫర్పామెన్స్ గురించి మనకు తెలిసిందే. గతంలో తన సోదరితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్ స్కిల్స్ ను అభిమానులకు చూపించాడు. తన చెల్లెలు శ్రేష్ఠ అయ్యర్ తో కలిసి.. బాస్కెట్ బాల్ కోర్టులో ట్రెండింగ్ సాంగ్ అయిన ‘మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్’ అంటూ తమిళ పాటకు ఇద్దరు కలిసి చిందులేశారు. ఇద్దరు కలిసి సింప్లీ సూపర్ స్టెప్పులతో పాటకు మరింత అందాన్ని తెచ్చారు.
ఇక ఈ వీడియోకు ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డ్యాన్సింగ్ అంటూ క్యాప్షన్ సైతం జతచేసింది శ్రేష్ఠ. ప్రస్తుతం శ్రేష్ఠ కొరియోగ్రాఫర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ కు దూరం అయిన అయ్యర్.. రెండో టెస్ట్ లోకి బరిలోకి దిగాడు. అయితే రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలం అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లోనూ ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ చేతికే చిక్కడం గమనార్హం. ప్రస్తుతం మూడో టెస్ట్ కోసం సాధన చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అప్పుడప్పుడు ఇలా తన సోదరితో కలిసి వీడియోల్లో డ్యాన్స్ లు చేస్తుంటాడు అయ్యర్. ప్రస్తుతం ఈ అన్నా చెల్లెలు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.