శార్దుల్ ఠాకూర్ పెళ్లి వేడుకకు ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు సందడి చేశారు. స్వయంగా పాటలు పాడటమే కాకుండా.. పెళ్లికొడుకు పెళ్లికూతురితో డాన్స్ చేయించారు.
టీమిండియా యువ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ నేడు(సోమవారం) పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో అంగరంగవైభవంగా శార్దుల్-మిథాలీ పారుల్కర్ పెళ్లి వేడుక జరగనుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నేడు పెళ్లిపీఠలు ఎక్కనుంది. ఈ వివాహ ఘడియకు ముందు హల్ది, సంగీత్ లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టీమిండియా క్రికెటర్లు సైతం పాల్గొన్నారు. టీమిండియా యువ స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు అభిషేక్ నాయర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం శార్దుల్ సంగీత్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్ రచ్చరచ్చ చేశారు.
పెళ్లికొడుకు శార్దుల్‌తో పాట పాడించడమే కాకుండా.. తాము పాట పాడుతుంటే పెళ్లికొడుకు, పెళ్లికూతురితో డాన్స్ చేయించారు. ప్రస్తుతం ఈ సందడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే రోహిత్ శర్మ తన భార్యతో కలిసి శార్దుల్ సంగీత్ పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ షేర్వాణిలో రోహిత్ శర్మ చాలా అందంగా ఉన్నాడు. పెద్దల అంగీకారంతో 2021 నవంబర్‌లో శార్దూల్ ఠాకూర్ – మిథాలీ పారుల్కర్ నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్‌మెంట్‌లో శార్దూల్ – మిథాలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరి పెళ్లి గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత జరగాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 27 సోమవారం వీరి వివాహ వేడుక జరగనుంది.
ఇక శార్దుల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల తర్వాత జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. గాయంతో టీమిండియాకు దూరమైన శార్దుల్.. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. పెళ్లి కార్యక్రమాల తర్వాత మళ్లీ ఆటపై ఫోకస్ పెట్టనున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఈ ఐపీఎల్ సీజన్‌లో శార్దుల్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన శార్దుల్‌ను ఇంటర్నల్ ట్రేడింగ్‌లో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శార్దుల్‌ను కొనుగోలు చేసింది. క్రికెట్ సంగతి పక్కనపెడితే.. శార్దుల్ సంగీత్‌లో టీమిండియా క్రికెటర్లు చేసిన సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Such a lovely video – Shreyas Iyer and Abhishek Nayar were also there. pic.twitter.com/f9mS1CYUGJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 27, 2023
Wow !.. Rohit Sharma is looking fabulous with Shreyas Iyer in this outfit. pic.twitter.com/bHiuh2xg7b
— Vishal. (@SPORTYVISHAL) February 26, 2023
Rohit Sharma and Ritika Sajdeh looked dashing during the sangeet ceremony of Shardul Thakur 🤩🔥
📸: Ritika Sajdeh pic.twitter.com/ISWvb0QIyQ
— Sportskeeda (@Sportskeeda) February 27, 2023