అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు.
38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20ల్లో ఆడి, అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయంగా వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై మార్ష్ కేవలం టీ20 ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు. టెస్టు క్రికెట్‌కు మార్ష్ 2019లోనే గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తొలుత టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్ష్ ఇప్పుడు వన్డేలు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మిగిలింది టీ20 క్రికెట్ మాత్రమే.
39 ఏళ్ల మార్ష్ 2001లో తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను మొదలుపెట్టాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మార్ష్ ఆ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అలాగే లిస్ట్-ఏలో 177 మ్యాచ్‌లు ఆడి 7158 పరుగులు చేశాడు. అలాగే.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా 2022లో ప్రతిష్టాత్మక పెఫీల్డ్ ట్రోఫీని సాధించాడు. ఇక అంతర్జాతీయ కెరీర్‌కు వస్తే.. ఇప్పటి వరకు 73 వన్డేలు ఆడిన మార్ష్.. 40.77 సగటుతో 2773 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లోనూ 71 మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 2477 పరుగులు చేశాడు. అతనికి ఐపీఎల్‌లో ఒక సెంచరీ కూడా ఉంది. మరి మార్ష్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shaun Marsh has retired from first-class cricket. He played 38 Tests for Australia, scoring six centuries, and gave 22 years of service to Western Australia in the Sheffield Shield https://t.co/nkFgWAjYWu pic.twitter.com/Psjg3spr4T
— ESPNcricinfo (@ESPNcricinfo) March 10, 2023