SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shane Warne Biggest Fight With Marlon Samuels In Bbl League Goes Viral

షేన్ వార్న్ కెరీర్ లో అదే అతి పెద్ద గొడవ! కొట్టుకునేదాకా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 5 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షేన్ వార్న్ కెరీర్ లో అదే అతి పెద్ద గొడవ! కొట్టుకునేదాకా!

క్రికెట్ లో స్పిన్ మాంత్రికుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా లెజండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ శుక్రవారం(మార్చి 4) థాయ్‌లాండ్లోని ఓ విల్లాలో మరణించిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వయసున్న షేన్ వార్న్ హార్ట్ అటాక్ తో మరణించినట్లు అక్కడి పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇక వార్న్‌ మృతిపట్ల యావత్‌ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్‌ ప్రముఖులు విషాదంలో మునిగారు. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టిన షేన్ వార్న్.. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ తరఫున 1992లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్న్, 1993 లో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి వెయ్యికి పైగా వికెట్లు తీశాడు.

జట్టు ఏదైనా.. పిచ్ ఎలాంటిదైనా తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు అంతుచిక్కని బంతులను వేస్తూ వికెట్లు తీయగల సమర్థుడు షేన్ వార్న్. ఇక 1993లో యాషెష్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచులో అతడు వేసిన ఓ బంతి ’బాల్ ఆప్ ద సెంచరీ‘గా నిలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గ్యాటింగ్ ను ఎక్కడో లెగ్ స్టంప్ ఆవల పిచ్ అయిన బంతి అనూహ్యంగా గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటేసింది. ఆ బంతితో వార్న్ ఒక్కసారిగా ప్రపంచ హీరో అయిపోయాడు. అయితే ఇవన్నీ.. వార్న్ జీవితంలో ఒక వైపు మాత్రమే. మరో వైపు వివాదాలు కనిపిస్తాయి. 2003 ప్రపంచకప్ ముంగిట డోపీగా తేలడం, ఫిక్సింగ్ ఆరోపణలు, అమ్మాయిలతో రాసలీలలు.. ఇలా మరెన్నో అతడి మంచితనాన్ని చెడిపేశాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా వెస్టిండీస్ ప్లేయర్ సామ్యూల్స్ తో వివాదం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది.

An ugly, but unforgettable moment in one of the @BBL‘s earliest Melbourne Derbies.

Join Our Whatsapp Channel

Warne vs Samuels is No.9 in our countdown: https://t.co/PQmRqn1r0i pic.twitter.com/sQfa9zfRJo

— cricket.com.au (@cricketcomau) November 19, 2020

ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ 2012-13 సీజన్ సందర్భంగా మెల్ బోర్న్ స్టార్స్, మెల్ బోర్న్ రెనెగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. స్టార్స్ బ్యాటర్ డేవిడ్ హస్సీ రెండో పరుగు తీస్తున్న సమయంలో అతడిని ప్రత్యర్థి ప్లేయర్ సామ్యూల్స్ అడ్డుకున్నాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వార్న్.. సామ్యూల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడితో గొడవ పెట్టుకున్నాడు. ’జెర్సీ పట్టుకొని లాగుతావా నువ్వు‘ అంటూ అసభ్యకర పదాలతో సామ్యూల్స్ ను దూషిస్తాడు. అనంతరం సామ్యూల్స్ పై బంతిని కూడా విసరతాడు. దీనికి ఆగ్రహించిన సామ్యూల్స్ వార్న్ కు సమీపంగా బ్యాట్ ను త్రో చేస్తాడు. ఒక రకంగా మ్యాచ్ లో వీరిద్దరూ కొట్టుకుంటారా అన్నట్లు కనిపిస్తారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags :

  • Big Bash League
  • Cricket Australia
  • Cricket News
  • Shane Warne
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్‌.. ప్రధాన ప్లేయర్‌ దూరం!

  • శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

    శృంగార సన్నివేశంలో అపశృతి.. ఆసుపత్రి పాలైన హీరో, హీరోయిన్

  • Cricket Australia: ఆసీస్ బ్యాటర్స్ క్రేజీ రికార్డ్ .. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

    ఆసీస్ బ్యాటర్స్ క్రేజీ రికార్డ్ .. 39 ఏళ్లలో ఇదే తొలిసారి

  • David Warner: టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

    టెస్ట్ క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్.. అదే నా చివరి మ్యాచ్ అంటూ ప్రకటన

  • క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. WTC ఫైనల్ ఫ్రీగా చూసే అవకాశం

    క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. WTC ఫైనల్ ఫ్రీగా చూసే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam