ఇండియన్ అమ్మాయిలు అదరగొట్టేశారు. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ 2023లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ ఒకే ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లు, చివరి బంతికి ఒక సిక్స్ కొట్టి ఏకంగా 26 పరుగులు రాబట్టుకుంది. అలాగే కేవలం 16 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు సాధించింది. షఫాలీతో పాటు ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. కేవలం 57 బంతుల్లోనే 20 ఫోర్లతో 92 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి.. టీమిండియాను గెలిపించింది. బెనోనిలోని విల్లోమూర్ పార్క్ గ్రౌండ్‌లో సౌతాఫ్రికాతో జరిగిన అండర్ 19 టీ20 వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సిమోని 61 రన్స్‌తో రాణించింది. ఇక భారత బౌలర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ 2, సోనమ్ యాదవ్, పీ చోప్రా తలో వికెట్ పడగొట్టారు. ఇక 167 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఓపెనర్ శ్వేత 92 పరుగులతో చెలరేగి ఆడింది. అలాగే మరో ఓపెనర్, కెప్టెన్ షఫాలీ వర్మ సైతం తన పవర్ హిట్టింగ్‌తో సౌతాఫ్రికా బౌలర్లలకు చుక్కలు చూపించింది. కేవలం 16 బంతుల్లోనే 9 ఫోరు, ఒక సిక్స్ బాదేసింది. ఫోర్లు, సిక్స్‌తోనే 42 పరుగులను కొట్టేంది. ఇక మొత్తం 45 రన్స్ చేసిన షఫాలీ.. ఇన్నింగ్స్ 7వ ఓవర్ తొలి బంతికి అవుటైంది. అప్పటికే టీమిండియా 77 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది.
ముఖ్యంగా సౌతాఫ్రికా బౌలర్ న్తబిసెంగ్ నిని వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో అయితే షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆ ఓవర్‌లో అన్ని బంతులను బౌండరీ లైన్ దాటించింది. తొలి 5 బంతుల్లో వరుసగా ఐదు ఫోర్లు బాదిన షఫాలీ.. చివరి బంతిని సిక్స్‌గా మలిచి.. ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఇక షఫాలీ అవుటైన తర్వాత.. వన్‌డౌన్‌లో వచ్చిన మన తెలుగమ్మాయి త్రిషా 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగుల చేసి ఒక డిసెంట్ నాక్ ఆడింది. విజయం ముంగిట్లో 10 పరుగులు చేసిన సౌమ్య తివారి అవుట్ అయింది. చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయిన ఓపెనర్ శ్వేతా 92 రన్స్‌తో సోనియా 1 రన్‌తో నాటౌట్‌గా నిలిచారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై అలాగే షఫాలీ వర్మ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shafali Verma smashed 4,4,4,4,4,6 in a single over.pic.twitter.com/A1oNRCd61L
— Johns. (@CricCrazyJohns) January 14, 2023
4️⃣4️⃣4️⃣4️⃣4️⃣6️⃣ 🔥🔥
Skipper @TheShafaliVerma scores 26 runs in the sixth over as #TeamIndia move to 70/0 after 6 overs.
Solid start in the chase for #TeamIndia 🙌
Follow the match👉https://t.co/sA6ECj9P1O…#TeamIndia | #U19T20WorldCup pic.twitter.com/LAATIxQjPc
— BCCI Women (@BCCIWomen) January 14, 2023