అతడో ప్రముఖ బౌలర్. దేశం తరఫునే కాకుండా ఐపీఎల్ లోనూ పాల్గొన్నాడు. గతేడాది కొన్ని ఆరోపణల వచ్చాయి. ఇప్పుడు గ్రౌండ్ లో జరిగిన ఓ విషయం వైరల్ గా మారింది.
అతడో ప్రముఖ బౌలర్. దేశం తరఫున పలు మ్యాచులు కూడా ఆడాడు. తాజాగా ఓ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి ఘోర అవమానం ఎదురైంది. మ్యాచ్ అంతా బాగా ఆడారు. ఆతిథ్య జట్టు అద్భుతమైన విజయం సాధించింది. అక్కడివరకు బాగానే ఉంది. అయితే సదరు బౌలర్ కు ఇన్సిడెంట్ జరగడానికి కారణం.. గతేడాది జరిగిన ఓ సంఘటనే అని తెలుస్తోంది. ఇప్పుడు దీని గురించి అటు క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా బౌలర్? అసలేం జరిగింది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా స్కాట్లాండ్, నమీబియా జట్లు నేపాల్ పర్యటనకు వచ్చాయి. ఈ మూడు జట్లు ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. నేపాల్-స్కాట్లాండ్ మధ్య శుక్రవారం ఓ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 274/9 రన్స్ చేసింది. అనంతరం నేపాల్ జట్టు.. దీన్ని 47 ఓవర్లలోనే పూర్తి చేసిది. కుశాల్ (81), దీపేంద్ర సింగ్(85 రన్స్) అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. నార్మల్ గా మ్యాచ్ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కామన్. ఈ మ్యాచులోనూ అలానే జరిగింది. అయితే అందరూ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన స్కాట్లాండ్ ప్లేయర్లు.. నేపాల్ బౌలర్ సందీప్ లామిచానేని మాత్రం ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
అయితే ఇలా సందీప్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఉందనిపిస్తోంది. నేపాల్ కెప్టెన్ సందీప్.. అత్యాచార ఆరోపణలపై గతేడాది అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే న్యాయస్థానం షరతులకు లోబడి నేపాల్ క్రికెట్, అతడిపై నిషేధం ఎత్తివేసింది. స్వదేశంలో ట్రై సిరీస్ ఆడేందుకు పర్మిషన్ ఇచ్చింది. కెప్టెన్సీ మాత్రం సందీప్ కు బదులు రోహిత్ పౌడేల్ కు అప్పగించింది. స్కాట్లాండ్ తో మ్యాచులో సందీప్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 10 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా వస్తున్న ఆరోపణల వల్ల ఇలా గ్రౌండ్ లో ఘోరంగా అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్ తో ఇలానే వ్యవహరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరి ప్రముఖ బౌలర్ సందీప్ కు మ్యాచ్ తర్వాత అవమానం జరగడంపై మీరేం అంటారు. కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Scotland Cricket Team refuses after match handshake with Sandeep Lamichhane.
सन्दीप लामिछानेसँग हात मिलाएनन् स्कटिस खेलाडीलेhttps://t.co/bajsRRvfcDpic.twitter.com/mv3LHF4vYa
— NepalLinks ︎ (@NepaliPodcasts) February 17, 2023