క్రికెట్‌లో సాధారణంగా.. తొలి ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే బ్యాటర్లే భారీ స్కోర్లు నమోదు చేస్తుంటారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సీజన్ 2022-23లో సౌరాష్ట్ర బౌలింగ్ ఆల్‌రౌండర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెంచరీ బాదేశాడు. అది కూడా మరీ జిడ్డు బ్యాటింగ్‌తో కాదు.. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సులు కూడా ఉన్నాయి. 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడిన తన జట్టును ఆదుకుంటూ.. అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్రికెటర్ పార్థ్ భట్. సౌరాష్ట్రకు చెందిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 155 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా.. తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
పంజాబ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రంజీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర పరుగులు ఏమీ చేయకుండానే ఓపెనర్ హర్విక్ దేశాయ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ స్నెల్ పటేల్, వన్‌డౌన్ బ్యాటర్ విశ్వరాజ్ జడేజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించిన తర్వాత జడేజా 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి సౌరాష్ట్ర వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. షెల్డన్ జాక్సన్ 18, కెప్టెన్ అర్పిత్ వాసవద 0, చిరాగ్ జానీ 8, ప్రేరక్ మంకడ్ 5, ధర్మేంద్రసింగ్ జడేజా 12 పరుగులు చేసి విఫలం అయ్యారు. దీంతో సౌరాష్ట్ర 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. సౌరాష్ట్ర కనీసం 150 పరుగుల మార్క్ అయినా దాటుతుందా అనే అనుమానం కలిగింది.
కానీ.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పార్థ్ భట్.. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో రెచ్చిపోయిన భట్.. 111 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో సౌరాష్ట్ర స్కోర్ 300 మార్క్ దాటింది. అతనికి తోడు ఓపెనర్ స్నెల్ పటేల్ సైతం 70 పరుగులు చేసి రాణించడంతో సౌరాష్ట్ర 303 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆలౌట్ అయింది. 111 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన పార్థ్ భట్ ఈ ఇన్నింగ్స్‌లో హీరోగా నిలిచాడు. ప్రస్తుతం పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 126, నామన్ ధీర్ 131 సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ అవుటైన తర్వాత సౌరాష్ట్ర బౌలర్లు చెలరేగి వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. సెంచరీతో చెలరేగిన పార్థ్ భట్ సైతం ఒక వికెట్ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో పార్థ్ భట్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HUNDRED! 💯
This has been as superb knock so far under pressure from Parth Bhut lower down the order for Saurashtra 👏🏻
Follow the match ▶️ https://t.co/Qjh7r8OTSL#SAUvPUN | #RanjiTrophy | #QF2 pic.twitter.com/33IKXQuWuu
— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2023