భారత జట్టులో చోటు దక్కించుకోవాలని చకోర పక్షిలా ఎదురుచూస్తున్న యువ క్రికెటర్.. జీవితంలో మరో దశలోకి ప్రవేశించాడు.
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి.. టీమిండియాలో చోటు దక్కుంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో విరుచుకుపడుతున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్ జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాకు చెందిన యువతిని వివాహమాడాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో వైరల్‌గా మారాయి. రంజీల్లో ముంబైకి, ఐపీఎల్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ఫిట్‌నెస్ లోపం వల్లే భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటన కోసం టెస్టు జట్టులో సర్ఫరాజ్‌ను ఎంపిక చేస్తారని అందరూ భావించినా.. సెలెక్టర్లు మాత్రం అతడికి మొండి చేయి చూపారు.
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోల్లో సర్ఫరాజ్ సంప్రదాయబద్ధమైన నలుపు రంగు షేర్వాణీలో తళుక్కుమనగా.. వధువు ఎర్ర రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది. అయితే పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. ఓ వీడియాలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని సర్ఫరాజ్ అన్న మాటలు వైరల్‌గా మారాయి. ‘కశ్మీర్‌లో పెళ్లి జరగాలని ముందే రాసిపెట్టి ఉన్నట్లుంది’ అని సర్ఫరాజ్ అన్నట్లు అందులో వినిపించింది. విధి సహకరిస్తే.. ఏదో ఒకరోజు భారత జట్టుకు తప్పక ఆడుతా అని కూడా సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
లిటిల్ మాస్టర్ సునిల్ గవాస్కర్ కూడా సర్ఫరాజ్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. గత రెండు రంజీ సీజన్లలో నిలకడగా రాణిస్తున్న ఆటగాడికి.. జాతీయ జట్టులో చోటు దక్కనప్పుడు రంజీ ట్రోఫీ నిర్వహించాల్సిన అవసరం ఏముందని విమర్శించాడు. సర్ఫరాజ్‌లో నైపుణ్యానికి కొదవ లేకపోయినా.. అతడి ఫిట్‌నెస్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో లేవనేది అతడిని చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. కేవలం బ్యాటింగ్ చేస్తే భారత జట్టులో చోటు దక్కదని ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని సర్ఫరాజ్‌కు పలువురు సలహా ఇచ్చారు. భారీ ఆశలు పెట్టుకున్న సమయంలో జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడంతో దేశవాళీ టోర్నీలో సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ మితిమీరిన సంబరాలు చేసుకోవడం కూడా వార్తల్లోకెక్కింది. అతడికి టీమిండియాలో చోటు దక్కకపోవడానికి ప్రవర్తన కూడా ఒక కారణమే అని అప్పట్లో ఓ అధికారి వెల్లడించారు.
Sarfaraz Khan, indian cricketer from Mumbai got married to a Kashmiri girl in Shopian.
The girl will not lose her citizenship, property etc. in Kashmir’.
Thanks Modi ki for the abrogation of 370 and 35A.
Retweet it .pic.twitter.com/fNUFSSKaV7
— Aquib Mir (@aquibmir71) August 7, 2023