నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే క్రికెట్‌లో కూడా కామెడీ పండించగల నంబర్ వన్ టీమ్ ఏదైన ఉందంటే.. అది కచ్చితంగా పాకిస్థానే. రూల్స్ తెలియకో.. ఫన్సీ రనౌట్స్‌తో.. చెత్త ఫీల్డింగ్‌తో.. క్రికెట్ ఫ్యాన్స్‌ను కడుపుబ్బా నవ్వించే టాలెంట్ పాక్ క్రికెటర్ల సొంతం. ఇక క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు వెళ్లి.. ఇద్దరూ దాన్ని విలేసి ఒకరినొకరు చూసుకోవడం పాక్ ఫీల్డర్లకే సాధ్యం, అలాగే వికెట్ల మధ్య రన్స్ కోసం పరిగెత్తుతూ.. ఇద్దరు బ్యాటర్లు ఒక ఎండ్‌లో ఉండిపోయి రనౌట్ అవ్వడం కూడా వారికే చెల్లుతుంది. నో బాల్ రూల్స్ తెలియక అంపైర్లతో వాదాన పెట్టుకుని నవ్వుల పాలు కావడం వారి నైజం. గల్లీ క్రికెట్‌లో జరిగే ఇలాంటి ఫన్నీ సంఘటనలను ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తెచ్చి.. క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తారు.
తాజాగా.. మరో కొత్త ఫన్నీ ఇన్సిడెంట్‌తో మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కామెడీని అందించారు పాక్ ఆటగాళ్లు. బ్యాట్‌కు తాకిన బంతికి మధ్యలో ఒక స్టెప్ తన చేతుల్లో పడిన తర్వాత దాన్ని అవుట్ అంటూ అపీల్ చేశాడు పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్. జట్టులో అందరి కంటే సీనియర్ ప్లేయర్ అయిన సర్ఫరాజ్.. చాలా కాలం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి, రిజ్వాన్ ప్లేస్‌లో తుది జట్టులో ఆడుతూ బ్యాట్‌తో, వికెట్ కీపింగ్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ.. తాజాగా ఒక ఫన్నీ అపీల్‌తో నవ్వుల పాలయ్యాడు. చాలా క్లియర్‌గా బంతి స్టప్ పడి వచ్చిందని తెలిసినా.. ఏమి తెలియని వాడిలానే అవుట్ కోసం అపీల్ చేస్తూ.. రివ్యూ తీసుకోవాలని పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను కోరి.. నవ్వులు పూయించాడు.
ఈ సంఘటన.. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చోటు చేసుకుంది. హమ్జా బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఒక బాల్ తన బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్‌కు వెళ్లింది. అయితే.. అది కీపర్‌కు చేరకముందే ఒక స్టెప్ పడింది. ఆ తర్వాత డైవ్ చేస్తూ.. దాన్ని అందుకున్న కీపర్ సర్ఫరాజ్ బ్యాట్‌కు తగిలింది.. నాకు వినిపించిందంటూ అవుట్ కోసం అపీల్ చేశాడు. రివ్యూ తీసుకోమన్నట్లు.. కెప్టెన్ బాబర్ వైపు చూపించాడు. కానీ.. బాబర్ మాత్రం అది ముందు స్టెప్ పడిందంటూ సర్ఫరాజ్ పరువుతీసేశాడు. దీంతో కామెంటేటర్లు సైతం సర్ఫరాజ్ చేసిన ఫన్నీ అపీల్‌కు నవ్వుకున్నారు. మరి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sarfaraz: Yeh Aee thi awaz 😂
Babar : Lakin agay gir gya ha 😂@SarfarazA_54 @babarazam258
pic.twitter.com/kXT5KVDYzN— Thakur (@hassam_sajjad) January 3, 2023