ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్ 2023 మినీ వేలంలో అత్యంత భారీ ధర పలికిన క్రికెటర్ సామ్ కరన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కరన్ చేసిన అతికి అంపైర్లు తగిన బుద్ధి చెప్పారు. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను చేసిన పనిని డిఫెండ్ చేసుకోకుండా.. సామ్ కరన్ జరిమానా కట్టేందుకే సిద్ధమయ్యాడు. కాగా.. మ్యాచ్ మధ్యలో సామ్ కరన్ చేసిన ఓవర్ యాక్షన్‌పై బాధిత ఆటగాడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.. ఫీల్డ్ అంపైర్లతో పాటు, మ్యాచ్ రిఫరీ సైతం సామ్ కరన్ ప్రవర్తనను తప్పుబడుతూ.. అతనికి జరిమానా విధించారు.
ఇంతకీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా సెంచరీ చేసిన తర్వాత సామ్ కరన్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటనే బవుమా వైపే చూస్తూ.. కొంచెం అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది ఫీల్డ్ అంపైర్లకు ఏమాత్రం నచ్చలేదు. నిజానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. సామ్ కరన్ ప్రవర్తనపై మ్యాచ్ రిఫరీకి అంపైర్లు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ కరన్‌కు జరిమానా విధించారు. అలాగే కరన్‌కు రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇచ్చారు. తనపై వచ్చిన ఫిర్యాదుపై ఏ మాత్రం స్పందించని కరన్, జరిమానా కట్టేందుకే మొగ్గుచూపాడు.
అయితే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన 342 పరుగుల భారీ స్కోర్ చేసినా.. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా 109 పరుగులతో వీరోచితంగా ఆడి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 343 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు తొలి వన్డేలోనూ విజయం సాధించిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే.. బాగా ఆడుతున్న బ్యాటర్‌ను అవుట్ చేసిన సెలబ్రేట్ చేసుకోవడం సహజమే అయినా.. సామ్ కాస్త అతిగా ప్రవర్తించాడంటూ.. క్రికెట్ అభిమానులు సైతం పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Justice!
Sam Curran has been fined 15% of his match fee and givem 1 demerit point for the way he acted towards Bavuma in the 2nd ODI #SAvENG pic.twitter.com/ZhanSaZFa7
— ThePoppingCrease (@PoppingCreaseSA) January 31, 2023