పాపం.. తమకు నచ్చిన ప్లేయర్ల ఆట చూసేందుకు ప్రేక్షకులు గ్రౌండ్‌కు వచ్చారు. కానీ వారికి తెలియదు కాసేటట్లో పెద్ద విషాదం చోటుచేసుకుంటుందని.
ఆటలను ఇష్టపడే వారు వాటిని లైవ్‌గా చూసేందుకు స్టేడియాలకు వస్తుంటారు. గ్రౌండ్లో నేరుగా మ్యాచ్‌లను చూస్తే కలిగే ఫీలింగే వేరు. దాన్ని ఆస్వాదించేవారికే అది అర్థమవుతుంది. అయితే స్టేడియాల్లో ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరగడం గురించి వినే ఉంటారు. తాజాగా ఒక స్టేడియంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. లోకల్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న టైమ్‌లో ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
కస్కట్లాన్ మైదానంలో జరిగిన ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందని నేషనల్ సివిల్ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని పోలీసు విభాగం పేర్కొంది. అలియాంజా, ఎఫ్ఏఎస్ టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలో ప్రవేశించే ప్రయత్నంలో ప్రేక్షకుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ఎల్ సాల్వడార్ ఇంటీరియర్ మినిస్టర్ జువాన్ కార్లోస్ బిడెగైన్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఉన్న సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు. మైదానం నుంచి ప్రజల్ని ఖాళీ చేయించి, మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని పేర్కొన్నారు.
At least nine people are killed in stampede at El Salvador stadium where football fans gather to watch local tournament – police pic.twitter.com/TCSzleGL4S
— TRT World Now (@TRTWorldNow) May 21, 2023