క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఒకటి కాదు రెండు.. ఏకంగా 7 సిక్సులు వరుసగా కొట్టి.. టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన యువరాజ్ రికార్డును దేశవాళీ క్రికెట్‌లో రుతురాజ్ బద్దలు కొట్టాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులతో పాటు నో బాల్ రూపంలో అదనంగా వచ్చిన బంతిని సైతం రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ అరుదైన ఫీట్.. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్-మహారాష్ట్ర మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహారాష్ట్ర కెప్టెన్ కమ్ ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్.. ఉత్తర ప్రదేశ్ బౌలర్లను చీల్చి చెండాడు. ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. చరిత్రలో కనీవిని ఎరుగని భారీ ఇన్నింగ్ ఆడాడు. 159 బంతులాడిన రుతురాజ్ 10 ఫోర్లు, 16 సిక్సులతో ఏకంగా 220 పరుగుల భారీ స్కోర్ చేశాడు. అయితే.. ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో మాత్రం సంచలనం నమోదు చేశాడు. యూపీ బౌలర్ శివసింగ్ వేసిన ఆ ఓవర్‌లో రుతురాజ్ విధ్వంసం సృష్టించాడు. తొలి నాలుగు బంతుల్లో రుతురాజ్ నాలుగు సిక్సులు కొట్టడంతో.. ఏం చేయాలో తెలియని బౌలర్ శివసింగ్.. ఐదో బంతిని నోబాల్‌గా వేశాడు. దాన్ని కూడా భారీ సిక్స్‌గా మల్చిన రుతురాజ్.. మరో రెండు బంతుల్లోనూ రెండు సిక్స్‌లు బాదేశాడు.
సంచలన బ్యాటింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఏకంగా 7 సిక్సులు కొట్టిన వీరుడిగా నిలిచాడు. దీంతో ఆ ఓవర్‌లో మహారాష్ట్రకు ఏకంగా 43 పరుగులు వచ్చాయి. అలాగే వన్డే మ్యాచ్‌లో రుతురాజ్ డబుల్ సెంచరీ చేయడం మరో విశేషం. ఇలా.. ఈ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించాడు రుతురాజ్. కాగా.. ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న రుతురాజ్ ఇప్పటికే ఇండియన్ క్రికెట్ అభిమానులకు సుపరిచిత క్రికెటర్. ఐపీఎల్‌ల్లో ఓపెనర్‌గా దుమ్ములేపుతున్న రుతురాజ్ ఇప్పటికే ఒక సెంచరీ కూడా కొట్టాడు. ఐపీఎల్ 2023 కోసం అతన్ని చెన్నై జట్టు రిటేన్ కూడా చేసుకుంది. కాగా.. ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. మరికొన్ని రోజుల్లోనే రుతురాజ్ గైక్వాడ్‌ను టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా చూసే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
Historic moment in Indian cricket – Take a bow, Ruturaj. pic.twitter.com/koyAaAo1Mu
— Johns. (@CricCrazyJohns) November 28, 2022
7 sixes in a single over by Ruturaj Gaikwad in Vijay Hazare Quarter-Final. pic.twitter.com/iS9ZqTddiP
— Johns. (@CricCrazyJohns) November 28, 2022
ROCKET RAJA 👑 MASS💥pic.twitter.com/uQscJB64X3
— CricTracker (@Cricketracker) November 28, 2022