టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్ బెస్ట్ ఫామ్‌లో కొనసాగుతున్న రుతురాజ్.. దేశవాళీ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా దరిదాపుల్లోకి వెళ్లని రికార్డును లిఖించాడు. విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో ఒక ఆటగాడు ఇప్పటి వరకు కేవలం 4 సెంచరీలు చేయడమే అత్యధికం. అలాంటిది ఏకంగా 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాది కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్.. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విఫలం అయ్యాడు. మిగతా 8 మ్యాచ్‌ల్లోనూ హెల్మెట్, బ్యాట్ ఎత్తి పట్టుకున్నాడు. ఇలాంటి ఫామ్ దేశవాళీ క్రికెట్‌లో ఇంతవరకు ఏ క్రికెటర్ కూడా చూపించలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్‌లో రుతురాజ్ ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో అతని స్కోర్లు ఇలా ఉన్నాయి.. 136, 154(నాటౌట్), 124, 21, 168, 124(నాటౌట్), 40, 220(నాటౌట్), 168, 108. అలాగే ఈ సీజన్‌లోనే ఒకే ఓవర్‌లో 7 సిక్సులు బాది సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే.
క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన రుతురాజ్.. సెమీ ఫైనల్లో సెంచరీతో జట్టును గెలిపించాడు. తాజాగా సౌరాష్ట్రతో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కూడా సెంచరీతో తన జట్టును ఆదుకున్నాడు. మహారాష్ట్ర టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్, టోర్నీ ఆరంభం నుంచి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్రకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పవన్ షా కేవలం 4 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సత్యజీత్‌తో కలిసి రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ.. 74 పరుగుల వద్ద సత్యజీత్, 105 పరుగుల వద్ద అంకిత్ అవుట్ అవ్వడంతో రుతురాజ్ కాస్త నెమ్మదిగా ఆడాడు. 61 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రుతురాజ్.. తర్వాత జోరు పెంచి 125 బంతుల్లోనే 102 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 83 పరుగులు చేసేందుకు రుతురాజ్ కేవలం 64 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అయితే.. 131 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 108 పరుగులు చేసి.. రన్ అవుట్ రూపంలో అవుటై పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మహారాష్ట్ర జట్టు 45 ఓవర్లలో 211 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. కాగా.. రుతురాజ్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి వెలుగులోని వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022 సీజన్‌లో కూడా రుతురాజ్ అదరగొట్టాడు. వచ్చే సీజన్ కోసం సీఎస్‌కే అతన్ని రీటేన్ చేసుకుంది. కాగా.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లోనూ దుమ్మురేపుతున్న రుతురాజ్‌కు టీమిండియాలో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
220*(159) in Quarter-Final
168(126) in Semi-Final
108(131) in finalBig stage, captain of Maharashtra stands tall, Take a bow, Ruturaj Gaikwad. pic.twitter.com/v5zyjYQiSm
— Johns. (@CricCrazyJohns) December 2, 2022
Ruturaj Gaikwad 100 Moment in Vizay Hazare Trophy Final !!! His Celebration shows how frustrated he was & badly wanted this 100 !
Played 3 match in Knockouts…100 in all 3 ! Started very slow, but recovered well later ! Go on Rutu 🦁💛 pic.twitter.com/Hy6oLXfYvT
— Shantanu 🎶 (@Shantanu630) December 2, 2022
Fifty in 96 balls.
Hundred in 125 balls.What a knock by Ruturaj, another top class stuff. pic.twitter.com/TPBS5BcG6L
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2022