ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. తన అల్లరి చేష్టలతో, ఓవర్ కాన్ఫిడెన్స్ కామెంట్లతో.. విమర్శల పాలైన యువ క్రికెటర్ రియాన్ పరాగ్. నునూగు మీసాలతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగల రియాన్ పరాగ్ ఐపీఎల్ 2022లో మంచి ప్రదర్శనలు చేశాడు. అలాగే పలు అతి వాఖ్యలతో క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. కానీ.. దేశవాళీ టోర్నీలో మాత్రం రియాన్ దుమ్ములేపాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం అదరగొట్టిన రియాన్.. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి అస్సాం జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. జమ్మూ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన రియాన్.. 116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సులు బాది 174 పరుగులు చేశాడు.
సోమవారం జమ్మూకశ్మీర్-అస్సాం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభమ్(120), నజీర్(124) సెంచరీలతో చెలరేగగా.. ఫాజిల్ రషీద్ 53 పరుగులతో రాణించడంతో జమ్మూ.. భారీ స్కోర్ చేసింది. 351 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన అస్సాం టీమ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రాహుల్ హజారికా 8 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్, అస్సాం కెప్టెన్ సాయికియా సైతం 23 పరుగులకే అవుట్ అవ్వడంతో అస్సాం కష్టాల్లో పడింది. కానీ.. ఇక్కడి నుంచి రిషవ్ దాస్-రియాన్ పరాగ్ జోడీ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
దాస్ 118 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 114 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. 116 బంతుల్లో 174 పరుగుల భారీ స్కోర్ చేశాడు. అందులో 12 ఫోర్లు, 12 సిక్సులు బాదాడు. విజయం ఖాయమైన దశలో 43వ ఓవర్‌లో జట్టు స్కోర్ 322పై ఉన్నసమయంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిగతా పనిని దాస్‌తో కలిసి సాహిల్ జైన్ పూర్తి చేశాడు. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అస్సాం ఛేదించింది. కాగా.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 47 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 37 ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్‌లో రియాన్ పరాగ్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం.
Third century in the #VijayHazareTrophy for Riyan Parag as his career-best List A knock helps Assam into the semifinals.https://t.co/Fj3JciH21b pic.twitter.com/lKrAg3k4c1
— Cricbuzz (@cricbuzz) November 28, 2022
Riyan Parag, Parag what did you eat in breakfast?
Playing One Day at a strike rate of 150 🔥🔥🔥🔥 pic.twitter.com/wF7PJGFpqg
— RockstaR MK (@RockstarMK11) November 28, 2022
Riyan Parag scored 174(116) in the QF of VHT 2022 to help Assam chase down 350 against Jammu and Kashmir! pic.twitter.com/EYZjw8b1If
— 12th Khiladi (@12th_khiladi) November 28, 2022
Time for some Bihu bcs why not…
Riyan Parag with a sensational 174(116) striked at the strike rate of 150.
The innings consisted of 12 fours and 12 maximums.
Rockstar Riyan Parag is here to rule 👊👊🤙🤙🤙 pic.twitter.com/uEswIJUyBZ
— Hara Sreekar (@Royal_HaRRa) November 28, 2022
Riyan Parag came in at 45/2 at 7 overs while chasing 350 and scoring almost 50% of the target runs. Take a Bow 🙇🏻♂️
.#riyanparag #riyan #parag #RajasthanRoyals #VijayHazareTrophy2022 #VijayHazareTrophy #sanjusamson #RuturajGaikwad #NZvINDonPrime #NZvIND #crickettwitter pic.twitter.com/cETExFISlm— Top Edge Cricket (@topedge_cricket) November 28, 2022