ఇటివల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ జ్ణాపకారక్ధం టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సైమండ్స్ పుట్టిన ఊరు టౌన్స్‌విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కాగా సైమండ్స్ టౌన్స్‌విల్లేలోనే జన్మించాడు.
ఎంతో మంది యువ క్రికెటర్లను సైమండ్స్ ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడు. అందుకే సైమండ్స్ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ వెల్లడించారు. ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటి వరకు హాంకాంగ్, పాపువా న్యూ గినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు చివర్లో ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
కాగా ఈ ఏడాది మేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం సైమండ్స్.. తన కెరీర్‌లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్ కీలక పాత్ర పోషించాడు. మరి ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి సైమండ్స్ పేరు పెట్టి గౌరవించడంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Andrew Symonds to have international cricket stadium named after him in home town of Townsville https://t.co/fqduPkFqIi
— Today Nigeria News (@todaynigernews) August 5, 2022
Late Andrew Symonds to have a stadium named after him
FULL NEWS HERE 👉https://t.co/ioRdW7isNZ#Cricket #AndrewSymonds #CricketTwitter pic.twitter.com/S9X89mZx4g
— SportsTiger (@sportstigerapp) August 5, 2022
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్!