భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. దీంతో సీరిస్ ను 2-1తో భారత్ చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్నిభారత్ 42.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో పంత్ 125 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన సెలబ్రేషన్స్ లో ఓ ఆసక్తి కరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ విరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
రిషబ్ పంత్.. ఈ మధ్య కాలంలో భారత క్రికెట్ లో వినిపిస్తున్న పేరు. టీమ్ కష్టకాలంలో ఉందంటే అందరి చూపూ పంత్ వైపే. అతను అలాగే తన పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాణిస్తున్నాడు. తాజాగా జరిగిన మూడో వన్డేలో శతకంతో అజేయంగా నిలిచాడు. పంత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రదానం చేశారు. ఈ క్రమంలో మైదానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులో భాగంగా పంత్ తనకు ప్రదానం చేసిన ‘షాంపేన్’ బాటిల్ ను మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికు ఇచ్చాడు. దాంతో రవిశాస్త్రి ఆ బాటిల్ ను ఎత్తి చిరునవ్వులు చిందించాడు. ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. మరి సరదాగా ఉన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Pant offering his champagne to Ravi Shastri#INDvENG #OldTrafford #Pant #TeamIndia pic.twitter.com/n9HguNNuID
— Tejesh R. Salian (@tejrsalian) July 17, 2022