గత కొంత కాలంగా టీమిండియా క్రికెట్ లో అత్యధిక విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. రిషబ్ పంత్ అనే సమాధానమే చాలా మంది నుంచి వస్తుంది. ఎన్ని ఛాన్స్ లు వస్తున్నాగానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తోలి మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలం అయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లో పంత్ అర్దశతకంతో రాణించాడు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు రిషబ్ పంత్.
రిషబ్ పంత్.. అవకాశాలు ఎన్ని వస్తున్నాగానీ వినియోగించుకోవడం లేదు.. ఇలాంటి ఆటగాడు జట్టులో ఎందుకు ఉంచడం, పక్కన పెట్టండి. పంత్ పై గత కొంత కాలంగా వస్తున్న విమర్శలు ఇవి. ఈ విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాలని పంత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ లో అర్దశతకం సాధించడం ద్వారా టెస్టుల్లో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్ లో పంత్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తూ.. రికార్డు ను నెలకొల్పాడు. ఇక రికార్డు విషయానికి వస్తే.. రిషబ్ పంత్ టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అంటే 2018 నుంచి మినిమం 1000 రన్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో లాంటి మేటి ఆటగాళ్లను వెనక్కినెట్టాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ 55 ఇన్నింగ్స్ ల్లో 44.38 యావరేజ్ తో 2219 పరుగులు చేశాడు. ఇక 73.50 స్ట్రైక్ రేట్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలోనే పంత్ తర్వాత బంగ్లా బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ 24 ఇన్సింగ్స్ ల్లో 72.09 స్ట్రైక్ రేట్ తో 1033 పరుగులు చేశాడు. మూడో స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ ఉండగా.. నాలుగు, ఐదులో డిక్ వెల్లా, జానీ బెయిర్ స్టో ఉన్నారు. ఆరవ ప్లేస్ లో ఆసిస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ 78 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 68 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మరోవైపు పంత్ కు అండగా శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి 5వ వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత జట్టు 191/4తో నిలకడగా స్కోర్ చేస్తోంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు.
The unstoppable Pant in Test cricket. pic.twitter.com/Tze3MTYTKb
— Johns. (@CricCrazyJohns) December 23, 2022