భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల 12 ఏళ్ల వివాహ బంధానికి తెరపడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో తాజాగా మరో కీలక అప్ డేట్ బయటకొచ్చింది. అదేంటంటే.. వారిద్దరూ ఇప్పటికే అధికారికంగా విడాకులు తీసుకున్నారట. షోయబ్ మాలిక్ వ్యవహారాలను పర్యవేక్షించే బృందంలోని ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారని ప్రముఖ స్పోర్ట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
2010లో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్స్.. ఎన్నో విమర్శల నడుమ దేశం సరిహద్దులు చేరిపేస్తూ.. తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్లో వీరి పెళ్లి ఒక సెన్సేషన్. మనదేశంలో మగవాళ్ళు లేరా! అంటూ సానియాపై ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ సానియా ఇవేమీ పట్టించుకోకుండా అతన్ని మనువాడింది. 2018లో వీరికి కొడుకు కూడా పుట్టాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. అయితే వీరిద్దరు వారి.. వారి.. వ్యక్తిగత జీవితాల దృష్ట్యా అప్పడప్పడు మాత్రమే కలుసుకునేవారు. వీరిద్దరి క్రీడా రంగాలు వేరు వేరు రంగాలు కదా! వీలు దొరకట్లేదేమో అని అందరూ అనుకున్నారు. అయితే.. ఇలా దూరంగా ఉండడానికి అసలు కారణం వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడమే అని తెలుస్తోంది.
Yoome sad 😢 india 🇮🇳 ka , t20cup se b bahir or baji b in ki wapis ghr #shoibmalik #T20WorldCup pic.twitter.com/S957dZ3Y7S
— Sulaiman Ashrf (@SulaimanAshrf) November 10, 2022
మాలిక్ మోసం చేయడంతోనే.. సానియా మీర్జా విడాకుల వరకు వెళ్లిందనే ఓ వార్త నెట్టింట వెలుగులోకి వచ్చింది. మాలిక్, అయేషా అనే మోడల్‌తో పెట్టుకున్న వివాహేతర సంబంధమే సానియా కాపురంలో నిప్పులు పోసాయన్నది ఆ వార్తల సారాంశం. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు ఆయేషా అనే మోడల్‌తో ఏర్పడిన పరిచయం ఏర్పడిందట. అది కాస్తా ప్రేమగా మారి చనువుగా ఉండే వరకు వెళ్లిందట. ఇటీవల ఈ విషయం ఇద్దరి మధ్య చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. మోడల్ తో పరిచయాన్ని తెంచుకోవడానికి మాలిక్ ఇష్టపడలేదన్నది అసలు నిజం. దీంతో ఇష్టపూర్వకంగానే వీరిద్దరు ఇప్పటికే విడాకులు తీసుకున్నారట. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ దగ్గరి వ్యక్తులే మీడియాకు లీక్ చేశారట. ఈ వార్తలపై ఈ జంట ఇప్పటికైనా స్పందిస్తుందేమో చూడాలి.
When you were born, we became more humble and life meant something special to us.
We may be not together and meeting everyday but Baba is always thinking about you and your smile every single second.
May Allah give you everything you ask for Izhaan…
Baba & Mama love you 💕 pic.twitter.com/3gmifb8url
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) October 30, 2022