బంగ్లాదేశ్ పర్యటన భారత జట్టుకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. అసలే మ్యాచ్ ఓడి బాధలో ఉంటే.. రాణిస్తారనుకున్న కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా గాయాల పాలు అవుతున్నారు. ఇప్పటికే సీనియర్ పేసర్.. మహమ్మద్ షమీ గాయం కారణంగా టోర్నీకే దూరమవ్వగా.. తాజాగా, యువ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ గాయపడినట్లు వార్తలొస్తున్నాయి. మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో శార్దుల్ ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం అతడు మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యులు గాయాన్ని పరిశీలించిన తర్వాత అతడు రెండో వన్డేకి అందుబాటులో ఉండే విషయమై ఓ నిర్ణయానికి రానున్నారు.
బంగ్లాదేశ్ వాతావరణం శార్దుల్ ఠాకూర్ కు పడట్లేదు. ఢాకాలోని చలి, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా తొలి వన్డేలో బౌలింగ్ చేసే సమయంలో అతడు కాళ్ల తిమ్మిర్లతో బాధపడ్డాడు. కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ తొలి వన్డేలో అలానే బౌలింగ్ కొనసాగించాడు. 2.30 ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. మొత్తంగా 9 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. 21 పరుగులు ఇచ్చాడు. ఇది మంచి ప్రదర్శనే అని చెప్పాలి. శార్దూల్ బౌలర్ గానే కాకుండా లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు కూడా చేయగలడు. ఈ క్రమంలో అతని లోటు భారత్ కు నష్టమనే చెప్పాలి.
Shardul Thakur changed the momentum of the match from his first over 🙌🏻#crickettwitter #indvsban pic.twitter.com/7FMD1WJnVI
— Sportskeeda (@Sportskeeda) December 4, 2022
బంగ్లా పర్యటనలో భారత్ వన్డే సిరీస్ తరువాత.. టెస్ట్ సిరీస్ కూడా ఆడాల్సివుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేనేజ్‌మెంట్ అతడిని ఆడించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదే జరిగితే.. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు తుది జట్టులో స్థానం దక్కొచ్చు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 7న ఢాకా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలి అని భారత జట్టు భావిస్తోంది.
India Vs Bangladesh, Shardul Thakur Is Unfit And Not Likely To Play In 2nd ODI, Umran Malik To Replace https://t.co/5jynu7dPHx
— TIMES18 (@TIMES18News) December 6, 2022