హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్ విషయంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఓ యూట్యూబ్ ఛానల్ లో కామెంట్ చేశాడు. అతని ఫిట్ నెస్ పై ముందే హెచ్చరించానంటూ చెప్పుకొచ్చాడు. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత హార్దిక్ పాండ్యాకు స్పైన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఫిట్ నెస్ పొంది ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ లో పాల్గొన్నాడు. కేవలం బ్యాటింగ్ చేస్తూ.. బౌలింగ్ చేయకుండా అంతంత మాత్రంగానే ప్రదర్శన చేయడం చూశాం. ప్రస్తుతం తనను ఎంపిక చేయకండి అంటూ హార్దిక్ పాండ్యా కోరుకున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన న్యూజిలాండ్ సిరీస్, దక్షిణాఫ్రికా టూర్ కు సైతం పాండ్యాను పక్కన పెట్టడం చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో అక్తర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
“I am happy because I’m grateful. I choose to be grateful. That gratitude allows me to be happy.” pic.twitter.com/P4UgCvq0NS
— Shoaib Akhtar (@shoaib100mph) December 11, 2021
‘నేను ఒకసారి దుబాయ్ హార్దిక్ పాండ్యా, జాస్ప్రిత్ బుమ్రాలను కలిశాను. వారు చాలా సన్నగా ఉన్నారు. వారి వెన్నెముకలు అంత బలంగా లేవని నాకు అనిపించింది. రెస్ట్ లేకుండా కంటిన్యూగా గేమ్ ఆడుతున్నట్లు పాండ్యా నాతో చెప్పాడు. అలా అయితే నువ్వు కొద్ది రోజుల్లో గాయపడతావు అని చెప్పాను. నేను చెప్పిన గంటన్నరకే పాండ్యా వెన్నెముకకు గాయమైంది’ అంటూ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. 2018లో హార్దిక్ పాండ్యా ఆసియా కప్ సందర్భంగా పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో గాయపడ్డాడు. పాండ్యా ఫిట్ నెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
My journey with @mipaltan. I’ll carry these memories with me for the rest of my life, I’ll carry these moments with me for the rest of my life. The friends I’ve made, the bonds that were formed, the people, the fans, I’ll always be grateful. I’ve grown not just as a player but .. pic.twitter.com/AZ1D3y4Epi
— hardik pandya (@hardikpandya7) December 2, 2021