టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగాం కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గత ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలికి గాయం కావడంతో అతడు జట్టుకు దూరం అయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకున్న జడేజా తన భార్య ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు జడ్డూ భాయ్. రంజీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు. దాంతో దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ రంజీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలక ప్లేయర్స్ అందరు రంజీలు ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జడేజా రంజీల్లోకి దిగుతున్నట్లు సమాచారం.
రవీంద్ర జడేజా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తూ.. కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే ఆసియా కప్ లో గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమిండియా కు దూరంగా ఉంటున్నాడు. మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్న జడేజా రంజీల్లో ఆడటానికి చెన్నై వచ్చాడు. తమిళనాడుతో మంగళవారం నుంచి జరగబోయే మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు జడేజా. సౌరాష్ట్ర ప్రస్తుత సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్, పుజారాలకు రెస్ట్ ఇచ్చారు.
Vanakkam Chennai..👋
— Ravindrasinh jadeja (@imjadeja) January 22, 2023
ఇక 2018 తర్వాత రవీంద్ర జడేజా మళ్లీ సౌరాష్ట్రతో కలిసి ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా త్వరలో ఆసిస్ తో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులోకి రావాలని చూస్తున్నాడు జడేజా. అందులో భాగంగానే మాజీ దిగ్గజాలు సూచించినట్లుగా రంజీలు ఆడాలని డిసైడ్ అయ్యాడు జడ్డూ భాయ్. అదీకాక పూర్తిగా ఫిట్ నెస్ నిరూపించుకుంటూనే జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో రంజీల్లోకి బరిలోకి దిగుతున్నాడు జడేజా. ఈ క్రమంలోనే ఆదివారం చెన్నై చేరుకున్న జడేజా చేసిన ట్వీట్ ప్రస్తుతం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి 5 ఏళ్ల తర్వాత రంజీల్లోకి అడుగుపెడుతున్న జడేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 JUST IN: India all-rounder Ravindra Jadeja will mark his comeback match as captain of Saurashtra in the #RanjiTrophy seventh round against Tamil Nadu in Chennai from Tuesday, reports @ayan_acharya13https://t.co/TGMaPvntIa
— Sportstar (@sportstarweb) January 23, 2023