టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెం.1 బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు అశ్విన్.
ప్రస్తుతం టీమిండియా జట్టు మంచి జోరుమీదుంది. వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. ఉత్సాహంతో పరుగులు తీస్తోంది. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే రెండు టెస్ట్ లు గెలిచి సిరీస్ లో 2-0 తో ముందంజలో ఉంది. ఇక ఈ సిరీస్ లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లు తమదైన బౌలింగ్ లో ఆసిస్ పతనాన్ని శాసిస్తున్నారు. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్ ల్లో కూడా టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ ఆలౌ రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెం.1 బౌలర్ గా అవతరించాడు.
రవిచంద్రన్ అశ్విన్.. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆసిస్ తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ దుమ్మురేపుతున్నాడు. దాంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ అండర్సన్ ను వెనక్కి నెట్టి టెస్టుల్లో నెం. 1 బౌలర్ గా అవతరించాడు. వారం రోజుల క్రితం నెం.1 బౌలర్ గా అవతరించాడు అండర్సన్.
ఈ క్రమంలోనే 864 పాయింట్లతో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో విఫలం అయిన అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడో స్థానంలో ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఉన్నాడు. ప్రస్తుతం ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో కనీసం 5 వికెట్లు తీస్తే.. అశ్విన్ తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకోగలడు. మరి ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ నెం.1 బౌలర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
👑 A new No.1 👑
India’s star spinner has replaced James Anderson at the top of the @MRFWorldwide ICC Men’s Test Bowling Rankings 👏
Details 👇https://t.co/sUXyBrb71k
— ICC (@ICC) March 1, 2023