ఆసిస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తొలి రెండు రోజులు భారత్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆసిస్. తొలి ఇన్నింగ్స్ లో ఆసిస్ 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180) భారీ శతకానికి తోడు..స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్(114) అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఇక భారత బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 6 వికెట్లతో మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు.ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులను తనపేరిట లిఖించుకున్నాడు.
ఆసిస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. దాంతో భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో చెలరేగాడు అశ్విన్. ఇక అశ్విన్ నమోదు చేసిన రికార్డుల వివరాల్లోకి వెళితే.. స్వదేశంలో టెస్ట్ క్రికెట్ లో అత్యధికంగా ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది. భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ల్లో కుంబ్లే అత్యధికంగా 25 సార్లు ఐదు వికెట్లు తీశాడు.
ఈ క్రమంపలోనే తాజాగా జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లు తీయ్యడం ద్వారా అశ్విన్ 26 సార్లు ఐదు వికెట్లు తీసి.. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్ గా అశ్విన్ టెస్టుల్లో ఐదు వికెట్లు తీయ్యడం ఇది 32వ సారి కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే మరో రికార్డును సైతం అశ్విన్ బ్రేక్ చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాథన్ లయోన్ (113)వికెట్లతో సమంగా నిలిచాడు అశ్విన్. అనిల్ కుంబ్లే 111 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరు మినహా మరో భారత బౌలర్ కూడా ఆసిస్ పై 100 వికెట్లు తీయలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం భారత్ రెండో రోజు ఆట ముగిసే సమాయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్ మన్ గిల్ (18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
113: Ravichandran Ashwin today became the leading wicket taker against Australia in Test surpassing Anil Kumble record
R Ashwin – 113 wickets
Anil Kumble – 111 wickets#BorderGavaskarTrophy #ravichandranashwin #INDvsAUSTest pic.twitter.com/xRYdVbw6SU— SportsKPI (@SportsKPI) March 10, 2023
Can Ravichandran Ashwin shatter Anil Kumble’s record for most five-wicket hauls in Test cricket? pic.twitter.com/bgrDSjxwH0
— RAJA SPORT News (@RAJASPORTNews1) February 12, 2023