భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం అయ్యింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వరుస సిరీస్ లు గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా.. అదే జోరును ఆస్ట్రేలియాపై కూడా చూపించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆసిస్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తియ్యడం ద్వారా 18 ఏళ్లుగా టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో తొలి రోజు భారత్ పై చేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసిస్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మెుదటి నుంచి అనుకున్నట్లుగానే నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అయ్యింది. దాంతో తమ పదునైన స్పిన్ మాయాజాలంతో భారత బౌలర్లు ఆసిస్ బ్యాటర్ల భరతం పట్టారు. టీమిండియా బౌలింగ్ ధాటికి తట్టుకోలేక మెుదటి రోజు చివరి సెషన్ లో 177 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన జడేజా 5 వికెట్లతో సత్తా చాటాడు. ఇక సీనియర్ బౌలర్ అశ్విన్ సైతం మూడు వికెట్లతో రాణించాడు.
అయితే అశ్విన్ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీయ్యడం ద్వారా 18 ఏళ్లుగా చెక్కుచెదకుండా ఉన్న టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు అశ్విన్. అలెక్స్ క్యారీని అవుట్ చెయ్యడం ద్వారా టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టాడు. దాంతో అరుదైన ఘనతను తనపేరిట లిఖించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అనిల్ కుంబ్లే 93 మ్యాచ్ ల్లో 450 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు అశ్విన్. కేవలం 89 టెస్టు మ్యాచ్ ల్లోనే ఈ ఘనతను సాధించాడు ఈ స్టార్ స్పిన్నర్.
Ravichandran Ashwin becomes the second Indian bowler after Anil Kumble to register 450 or more Test wickets 👏
An incredible achievement 🔥#RavichandranAshwin #India #INDvsAUS #Cricket #Tests pic.twitter.com/ynB190HaYU
— Wisden India (@WisdenIndia) February 9, 2023
ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ కేవలం 80 మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించగా.. అశ్విన్ అతని తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. మరి రవిచంద్రన్ అశ్విన్ 18 ఏళ్ల కుంబ్లే రికార్డును బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
4️⃣5️⃣0️⃣ 🆙
A landmark wicket for Ravichandran Ashwin! 🔥#INDvsAUS | BT Sport 1 pic.twitter.com/yvf0YOJifY
— Cricket on BT Sport (@btsportcricket) February 9, 2023