ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తి చూపిస్తారు. ఈ దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. ప్రపంచం మొత్తం క్రికెట్ మొత్తం క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంది. అయితే.. కొన్నేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. పాకిస్థాన్‌లో క్రికెటర్లపై బాంబు దాడి, ఇండియాలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడటం మానేసింది. అలాగే పాకిస్థాన్‌ను కూడా ఇండియాలోకి రానివ్వడం లేదు. అయితే.. వరల్డ్ కప్ లాంటి ఐసీసీ మెగా ఈవెంట్స్‌లు తప్పిస్తే.. భారత్-పాక్ జట్లు తలపడటం లేదు. దీంతో వరల్డ్ కప్స్‌లో ఎప్పుడో ఒకసారి జరుగుతున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లకు మరింత క్రేజ్ ఏర్పడింది.
అయితే.. 2023లో ఆసియా కప్‌తో పాటు, వన్డే వరల్డ్ కప్ కూడా జరగనుంది. ఈ రెండు మెగా టోర్నీల్లో ఇండియా-పాకిస్థాన్ తలపడనున్నాయి. కాగా ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. ఎందుకంటే.. ఆసియా కప్ 2023కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. వన్డే వరల్డ్ కప్ 2023కు భారత్‌లో జరగనుంది. టీమిండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లేకుంటే.. ఆసియా కప్‌ను చూసే వారుండరు. దీంతో.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కమిటీ ఛైర్మన్ అయినా బీసీసీఐ కార్యదర్శి జైషా.. ఆసియా కప్ 2023 వేదికను పాకిస్థాన్ కాకుండా.. వేరే చోటుకు మార్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2023లో ఆడేందుకు ఇండియా.. పాకిస్థాన్‌కు రావాలని పాక్ క్రికెట్ బోర్డు కోరింది. అందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలిసిన పాక్.. బెదిరింపుకు దిగింది.
ఇండియా ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ రాకుంటే.. పాకిస్థాన్ జట్టు కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియా రాదని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు. పైగా ఇండియా ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు వీలుగా ఆసియా కప్ 2023ను పాక్ నుంచి యూఏఈకి తరలించాలని బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టిన రమీజ్ రాజా. అలా చేస్తే.. తామ కచ్చితంగా పోరాడి తీరుతామని అన్నారు. ఇండియా.. పాకిస్థాన్ రావాలని తామేమి కోరుకోవడం లేదని.. కానీ.. క్రికెట్ అభిమానుల కోరికను గౌరవిస్తామని అన్నారు. పాక్‌కు ఇండియా రాకుంటే.. మేము భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని తేల్చిచెప్పాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ఒక బ్రాండ్‌లా ఎదిగిందని.. ఇండియాతో మ్యాచ్‌లు ఆడకపోయినా.. తమకు పర్వాలేదని అన్నాడు. అలాగే.. పాక్ ఆటగాళ్లకు ఇండియాలోనూ అభిమానులు ఉన్నారని, భారత్‌లో ఇండియా ఆడే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లనే భారతీయులు వీక్షిస్తారని రమీజ్ రాజా పేర్కొన్నారు.
“Pakistan has become a brand in international cricket, the players have got fan following in India, and I know that the second most watched team in India after India is Pakistan,” @iramizraja said.https://t.co/iBR3B4kPil
— Circle of Cricket (@circleofcricket) December 11, 2022