బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ.8 కోట్ల భారీ ధర పెట్టికొనుగోలు చేసింది. 2021 సీజన వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్ 2022 సీజన్‌లో ముంబై తరపున బరిలోకి దిగనున్నాడు. వేలానికి ముందు ఆర్చర్‌ను రిటేన్ చేసుకోని రాజస్థాన్.. వేలంలో మాత్రం అతని కోసం పోటీ పడింది. చివరకు ముంబై ఆర్చర్‌ను దక్కించుకుంది.
తాజాగా శ్రీలంక మాజీ దిగ్గజ పేసర్, యార్కర్ల కింగ్ లసిత్ మలింగాను రాజస్థాన్ తమ జట్టు స్పీడ్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. దీంతో ముంబై ఆర్చర్‌ను తీసుకుంటే.. రాజస్థాన్ గతంలో ముంబైకు ఆడిన మలింగాను తీసుకుని షాకిచ్చింది. మలింగా ఐపీఎల్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ అతన్ని బౌలింగ్ కోచ్‌గా నియమించింది. చాలా ఏళ్లు ముంబైలో కీ ప్లేయర్‌గా ఉన్న మలింగా.. ఇప్పుడు రాజస్థాన్ జట్టులో కీ రోల్ ప్లే చేయనున్నాడు.
ముంబైకు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఉండగా.. మలింగాను మెంటర్‌గా తీసుకోవాలని ముంబై ఫ్రాంచైజ్ భావించినట్లు సమాచారం. కానీ వాళ్ల కంటే ముందే మలింగాను తన బౌలింగ్ కోచ్ నియమించుకుని రాజస్థాన్.. ముంబైకు గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత స్వేచ్ఛ లేకుండా పోయింది: ధోని భార్య
*𝐤𝐢𝐬𝐬𝐞𝐬 𝐭𝐡𝐞 𝐛𝐚𝐥𝐥*
Lasith Malinga. IPL. Pink. 💗#RoyalsFamily | #TATAIPL2022 | @ninety9sl pic.twitter.com/p6lS3PtlI3
— Rajasthan Royals (@rajasthanroyals) March 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.