క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్ అంటారు. కానీ.., ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆటలోకి దిగాక ఆటగాళ్లు స్లెడ్జింగ్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా.. తట్టుకుని, ఏకాగ్రత కోల్పోకుండా టీమ్ విజయానికి దోహదపడితేనే వారు మ్యాచ్ విన్నర్స్ అవుతారు. ఈ విషయంలో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి క్రికెటర్స్ మిగతా ఆటగాళ్ళకి ఆదర్శం. అయితే.. అంతటి మిస్టర్ పెర్ఫక్ట్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఓ కీలక ఆటగాడు ఏకాగ్రత కోల్పోయి అనవసరమైన షాట్ ఆడి, వికెట్ పారేసుకుంటే.. ద్రావిడ్‌కి కోపం రావడంలో తప్పే లేదు అంటారా? సరిగ్గా.. ఈ ఘటన సౌత్ ఆఫ్రికా టెస్టులో జరిగింది.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త తడబడిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సౌత్ ఆఫ్రికాకి ఓ మోస్తరు టార్గెట్ ఇవ్వగలిగారు. అయితే.., కీలకమైన సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన పంత్.. చేతులారా తప్పు చేసి, అనవసరంగా అవుట్ అవ్వడమే ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన పంత్ కి సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల నుంచి స్లెడ్జింగ్ ఎదురైంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మేన్ డస్సెన్.. పంత్ ని బాగా టార్గెట్ చేసి నోరు పారేసుకున్నాడు. ఈ స్లెడ్జింగ్ కారణంగా ఏకాగ్రత కోల్పోయిన పంత్.. “హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడటం కన్నా.. నోరు మూసుకొని ఉండటమే బెటర్. అదే మంచి పద్ధతి” అంటూ డస్సెన్ కి రిప్లై ఇచ్చాడు.
It’s Kagiso Rabada again ⚡
Rishabh Pant makes the long walk back for a duck!
Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | https://t.co/WrcdXdQlUm pic.twitter.com/0dAn6LsYOW
— ICC (@ICC) January 5, 2022
అదే.. కోపంలో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి పంత్ నిర్లక్ష్యమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. మ్యాచ్ లో ఎంతో కీలకమైన సమయంలో అనవసరమైన భావోద్వేగానికి లోనై పంత్ ఇలా అవుట్ కావడంతో ద్రావిడ్ కోపంగా పంత్ వైపు చూస్తూ ఉండిపోయాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్ కి క్లాస్ తప్పదన్న కామెంట్స్ సోసల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు సునీల్ గవాస్కర్ కూడా పంత్ అవుటైన తీరుపై ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రియురాలితో విడిపోయిన రిషబ్ పంత్! ఇంత గొడవ జరిగిందా?