దాదాపు 136 కేజీల భారీ కాయంతో క్రికెట్‌లో హల్క్‌గా పిలువబడే రహ్కీమ్ కార్న్‌వాల్ దుమ్మురేపాడు. అంతర్జాతీయంగా కేవలం టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ క్రికెట్ హల్క్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022లో మాత్రం తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సిక్సులతో చెలరేగిపోయాడు. బంతి కొడితే బౌండరీ లైన్ అవతలే.. అతను కొట్టిన షాట్లను మైదానంలో ఫీల్డర్ల కంటే మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులే ఎక్కువగా పట్టుకున్నారు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ తాగినంత ఈజీగా సిక్సులు బాదాడు. కేవలం 54 బంతుల్లోనే రెండు ఫోర్లు, 11 సిక్సులతో 91 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. హల్క్ వీరబాదుడుకి గయాన అమెజాన్ వారియర్స్ బలైంది.
వెస్టిండీస్‌కు చెందిన ఈ 29 ఏళ్ల హల్క్ ఇప్పటి వరకు విండీస్ తరఫున కేవలం 9 టెస్టులు మాత్రమే ఆడాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 238 పరుగులతో పాటు 34 వికెట్లు కూడా పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్న ఘనత కూడా రహ్కీమ్‌కు ఉంది. కానీ.. వన్డే, టీ20 జట్లలో రహ్కీమ్‌కు చోటు దక్కలేదు. 2019లో టీమిండియాతోనే సబినా పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌తో రహ్కీమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వెస్టిండీస్ జట్టులోకి వచ్చిన రహ్కీమ్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. బౌలింగ్ విభాగంలో ఐసీసీ ర్యాకింగ్స్‌లో రహ్కీమ్ 72వ స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం గయాన అమోజాన్ వారియర్స్-బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విధ్వంసం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బర్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రహ్కీమ్ విధ్వంసానికి తోడు అజమ్ ఖాన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 52) చెలరేగడంతో బార్బోడోస్ భారీ స్కోర్ సాధించింది. ఈ భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గయాన 108 పరుగులకే కుప్పకూలింది. 17.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. గయాన కెప్టెన్ హెట్‌మేయర్ 29 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన రహ్కీమ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. రెండు ఓవర్లు వేసిన హల్క్ కేవలం 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సైతం పడగొట్టాడు.
LIVE visuals from the Providence Stadium. 🤭🤯💗 pic.twitter.com/SQ1LwMjCH0
— Barbados Royals (@BarbadosRoyals) September 27, 2022
Rahkeem Cornwall smashed 91 runs from 54 balls including 2 fours and 11 sixes in the Qualifier 1 in CPL. pic.twitter.com/RXYBromZqz
— Johns. (@CricCrazyJohns) September 27, 2022
Rahkeem Cornwall’s all-round show helps Barbados Royals to reach the CPL 2022 final.#CPL2022 pic.twitter.com/GIrwrNJTgw
— CricTracker (@Cricketracker) September 27, 2022
ఇది కూడా చదవండి: సినిమా హీరోల్లా మారిన కోహ్లీ-రోహిత్! పోటాపోటీగా భారీ కటౌట్లు