జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. భారత్ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా ఆడి తన జట్టుకు మంచి విజయం అందించాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది.
తర్వాత దక్షిణాఫ్రికాను కూడా తక్కువ స్కోర్‌కే 229కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 243 పరుగుల లక్ష్యం ఉంచింది. మూడో రోజు వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగినా.. నాలుగో రోజు ప్రోటీస్ వైపు ఏకపక్షం అయిపోయింది. నాలుగో రోజు టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక మూడో టెస్టు ఈ నెల 11 నుంచి ప్రారంభ కానుంది.
పనిచేయని రహానే, పుజారా సెంటిమెంట్..
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రహానే, పుజారా హాఫ్ సెంచరీలతో రాణించారు. చాలా కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఈ ఇద్దరు టెస్టు స్పెషలిస్టులు ఈ ఇన్నింగ్స్‌తో తిరిగిఫామ్లోకి వచ్చినట్లు కనిపించారు. 100 పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగ గతంలో రహానే, పుజారా సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పితే భారత్ ఎప్పుడూ టెస్టు మ్యాచ్ ఓడిపోలేదు. కానీ మొదటి సారి రహానే, పుజారా పార్ట్నర్షిప్ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరు కలిసి రెండో ఇన్సింగ్స్‌లో సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పినా భారత్.. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడింది. మరి రహానే, పుజారా సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: భారత్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం.. విరాట్ కోహ్లీకి థ్యాంక్స్!