పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 8వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ లో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకుంటున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు టోర్నీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యర్థి జట్టులో స్టార్ బ్యాటర్లను లక్ష్యంగా చేసుకుని బౌలర్లు నోటికి పనిచెబుతున్నారు.
పాక్ వేదికగా జరుగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ లో ఆటగాళ్ల మధ్య చోటుచేసుకుంటున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు టోర్నీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యర్థి జట్టులో స్టార్ బ్యాటర్లను లక్ష్యంగా చేసుకుని బౌలర్లు నోటికి పనిచెబుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ అమీర్ చర్యలు రోజురోజుకి శృతి మించుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ మ్యాచులో అమీర్.. పాక్ సారధి బాబర్ ఆజాంపై కోపంతో బాల్ విసిరిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరో వివాదంలో చిక్కుకున్నాడు. బ్యాటర్‌ను ఔట్ చేసిన ఆనందంలో అమీర్ చేసుకున్న వింత సెలెబ్రేషన్స్ అతన్ని వివాదంలోకి లాగాయి.
ఆదివారం (ఫిబ్రవరి 19) లాహోర్ ఖలాండర్స్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా, ఇమాద్ వసీం సారథ్యంలోని కరాచీ కింగ్స్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ 118 పరుగులకే చాపచుట్టేసింది. అయితే, ఈ మ్యాచులో పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ అమీర్ చేసుకున్న సెలెబ్రేషన్స్ వివాదాస్పదమవుతున్నాయి. లాహోర్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో షాయ్ హోప్‌ను ఔట్ చేసిన అమీర్ అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. వికెట్ల ముందుకు పరిగెత్తుతూ.. WWE స్టార్ ‘ట్రిపుల్ హెచ్’ వలే సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
#PakistanEconomy #karachi kings#psl #Amir king pic.twitter.com/j1OXIOcJtR
— Muhammad Ukasha Bhatti (@Muhamma60514497) February 20, 2023
అమీర్ సెలెబ్రేషన్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ‘ఇది WWE కాదు.. క్రికెట్..’ అంటూ అతనిపై తిట్ల పురాణం మొదలుపెట్టారు. కాగా, గత వారం బాబర్ ఆజాం విషయంలో వికృతంగా ప్రవర్తించినందుకుగానూ అమీర్ పై పాకిస్థాన్ మాజీ సారధి షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశారు. “యే కోయి తారీకా హై? (ఇదేనా ఆడుకోవటం..?) మీ చుట్టూ జూనియర్లు ఉన్నారు. చెడు మాటలు, చెడు సంజ్ఞలు చేయటం సరి కాదు. కుటుంబాలు, పిల్లలు మిమ్మల్ని టెలివిజన్‌లో చూస్తున్నారు. దూకుడు ఉండాలి కానీ దానిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పుకొచ్చాడు. అయితే, అమీర్.. షాహిద్ అఫ్రిది సూచనలను పట్టించుకోకుండా మరోసారి అలా ప్రవర్తించడంతో అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammad Amir has clearly ignored Shahid Afridi’s advice#KKvsLQpic.twitter.com/gmNmA7LjXQ
— Cricket Pakistan (@cricketpakcompk) February 19, 2023
Disgusting 😶 #HBLPSL2023 #HBLPSL8
— Alishba Khan (@_alishba_28) February 19, 2023