సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా మూడు టెస్టుల సిరీస్ కోసం 22 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాగా రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. కానీ పర్యటనకు ముందే రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రికెట్ అభిమానుల కన్ను ఇప్పుడు ప్రియాంక్‌పై పడింది. ఇప్పటివరకు ఎవరికీ అంతగా తెలియని ఈ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో ఏప్రిల్ 9, 1990లో ప్రియాంక్ జన్మించాడు. దేశవాళీ టోర్నీల్లో గుజరాజ్ రాష్ట్ర జట్టుకు ప్రియాంక్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రియాంక్ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్. ఇప్పటి వరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 7011 పరుగులు చేశాడు. ఇటివల సౌతాఫ్రికాలో పర్యటించిన టీమిండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు. ప్రియాంక్ ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ కూడా ప్రియాంక్‌ను ఎంపిక చేయాల్సిందిగా సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: టీమిండియా జట్టులో కోహ్లీ స్థానంపై స్పందించిన రోహిత్ శర్మ
దేశవాళీ టోర్నీలో రాణిస్తున్న ప్రియాంక్ అవసరం జాతీయ జట్టులో ఉందని ద్రావిడ్ గుర్తించినట్లు తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం పట్ల స్పందించిన ప్రియాంక్.. టీమిండియాకు ఆడడం తన కల అని, నాపై నమ్మకం ఉంచిన బీసీసీఐకి, సెలెక్టర్లకు ధన్యవాదాలు తెలిపాడు. మరి ప్రియాంక్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వన్డేలకు కోహ్లీ, టెస్టులకు రోహిత్ దూరం! ఎందుకీ మారం
More details here – https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG
— BCCI (@BCCI) December 13, 2021
Thank you everyone for all your good wishes. Honoured to be donning the team India jersey. Thank you for showing faith in me @BCCI . Looking forward to the series!
— Priyank Panchal (@PKpanchal9) December 14, 2021
Thank you @rpsingh bhai 😊 Means a lot coming from you 🙏🏼 https://t.co/eW4yyhFPIR
— Priyank Panchal (@PKpanchal9) December 14, 2021