క్రీడా ప్రపంచంలో కొందరు ఆటగాళ్లు వన్టేల్లో.. మరికొందరు టీ20ల్లో.. ఇంకొందరు టెస్టుల్లో తమదైన ముద్ర వేస్తూ ఉంటారు. అలా భారత టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆటగాడు ఛతేశ్వర్ పుజారా.. తన ఆటతో ‘నయా వాల్ ఆఫ్ ఇండియాగా’ పిలవబడుతున్నాడు. ప్రస్తుతం టీంఇండియా టీ20లు, వన్టే సిరీస్ లతో బిజీగా ఉంది. దీంతో తాజాగా ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతున్న పుజార అరుదైన రికార్డ్ సాధించాడు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు భారత టెస్టు బ్యాట్స్ మన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు రాహుల్ ద్రావిడ్. కాల క్రమంలో తన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఆటగాడు చతేశ్వర్ పుజారా.. గంటల తరబడి క్రీజులో పాతుకుపోవడం అతనికి సరదా. దీంతో అతనికి టెస్టు బ్యాట్స్ మెన్ అన్న ముద్ర పడిపోయింది. ఈ కారణంగా అతన్ని ఐపీఎల్ లో కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో అడపాదడపా కొన్ని పొట్టి మ్యాచ్ లు ఆడినా అంతగా రాణించలేదు. ఫామ్ కొల్పోయిన ఆటగాళ్లు ఇలా కౌంటీల్లో ఆడే తిరిగి ఫామ్ లోకి వచ్చి జట్టులోకి వస్తుంటారు.
ప్రస్తుతం పుజారా ఇంగ్లాండులో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా ‘ససెక్స్’ తరుపున ఆడుతున్నాడు. పుజారా గత కొంత కాలంగా ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడటం మనకు తెలిసిందే. కౌంటీల్లో తన క్లాస్ ఆటతో వరుస శతకాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపధ్యంలో ససెక్స్ జట్టు కెప్టెన్ టామ్ హైనెస్ గాయపడడంతో తాత్కాలిక కెప్టెన్ గా చతేశ్వర పుజారాని నియమించారు. దీంతో ఓ ఇంగ్లీష్ కౌంటీల్లో భారత ఆటగాడు కెప్టెన్ గా వ్యవహరించడం ఓ రికార్డు. అరుదైన గౌరవం దక్కించుకున్న భారత ఆటగాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨 Breaking 🚨
Cheteshwar Pujara will be the stand in captain of Sussex following Tom Haines injury in the county match today against Middlesex 🏏#cheteshwarpujara #sussexcricket #CricketTwitter pic.twitter.com/fUTjmDesbm
— Sportskeeda (@Sportskeeda) July 19, 2022