సాధారణంగా క్రీడాలోకంలో తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో శారీరక శ్రమ ఎక్కువ. అందుకే ఆటగాళ్లు తరచు గాయల బారిన పడి టోర్నీలకు దూరం అవుతుంటారు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, రోహిత్ శర్మ లు గాయపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యి.. ప్లేయర్ బాధపడుతుంటే ఇంకో పక్క పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడాడు మాజీ క్రికెటర్. ఆటగాళ్లు అతి పాడైతే తప్ప విశ్రాంతి తీసుకోరు అంటూ బోల్డ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వల్గర్ కామెంట్స్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం పాక్.. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో పాక్ 74 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందరు ఈ మ్యాచ్ డ్రా అవుతుంది అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ గాయపడ్డాడు. దాంతో తర్వాత మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది అనుమానంగా ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ పేసర్ అక్విబ్ జావేద్.. హారీస్ రౌఫ్ పై వల్గర్ కామెంట్స్ చేశాడు.
ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్విబ్ జావేద్ బోల్డ్ కామెంట్స్ చేశాడు. అతడు మాట్లాడుతూ..”టీ20లతో పాటుగా వన్డేలు, టెస్ట్ మ్యాచ్ లు ఆడే సామర్థ్యం ఉన్న బౌలర్లను మాత్రమే జట్టులోకి తీసుకోండి. సరైన శిక్షణ, అనుభవం లేని బౌలర్లను ఆడించకండి. గొప్ప పేరున్న బౌలర్ అయినంత మాత్రాన అతడిని ఆడించవలసిన అవసరం లేదు. ఇక బౌలర్లకు అది పాడైతే తప్ప విశ్రాంతి తీసుకోరు. హారీస్ రౌఫ్ టెస్ట్ క్రికెట్ కు పనికి రాడు. ఎందుకంటే అతడికి టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభంలేదు కాబట్టి” అంటూ కాస్త ఘాటుగా వ్యాఖ్యానించాడు అక్విబ్ జావేద్.
అదీకాక పాక్ జట్టులో మీర్ హంజా లాంటి ఎందరో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వారిని జట్టులోకి తీసుకోవాలి అని జావేద్ సూచించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువ వికెట్లు తీసే బౌలర్లను తీసుకుంటేనే వారు ఎక్కువ కాలంగా బౌలింగ్ చేయగలరని చెప్పుకొచ్చాడు. ఇక పార్ట్ టైమ్ బౌలర్లను మీరు స్కోరు ను నిలవరించడానికి ఎలా ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించాడు జావేద్. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారని కొనియాడాడు. ఇక.. రౌఫ్ టాప్ బాల్ క్రికెట్ నుంచి డైరెక్ట్ గా పాక్ జట్టులోకి వచ్చాడు. టాప్ బాల్ లో చూపిన ప్రతిభ కారణంగానే అతడిని ఓవర్ నైట్ లో టీమ్ లోకి తీసుకున్న నేపథ్యంలోనే ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జావేద్.. రౌఫ్ పై చేసిన వల్గర్ కామెంట్స్ క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి.
Former Pakistan pacer Aaqib Javed made a rather bold claim about the injured bowler. #HarrisRauf #PAKvENG https://t.co/VCJv3Zlzc4
— CricTracker (@Cricketracker) December 8, 2022