గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే.. ఎంత బాధ ఉంటుందో క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు. మరి అలాంటి మ్యాచ్ లే రెండూ ఓడిపోతే! ఇంకెంత బాధగా ఉంటుందో తాజాగా ఇంగ్లాండ్ కు తెలిసి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతోంది. తాజాగా ఉత్కంఠగా జరిగిన 5వ టీ20లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దాంతో 7 మ్యాచ్ ల సిరీస్ లో 3-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది పాక్. గత మ్యాచ్ లో మాదిరిగానే బ్రిటీష్ జట్టు లాస్ట్ ఓవర్ లో తడబడింది. అయితే ఈ సారి క్రీజ్ లో ఉంది ఆశామాషీ బ్యాటర్ కాదు బిగ్ హిట్టర్ మెుయిన్ అలీ. అయినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టుకు చివరి ఓవర్ భయం ఇంకా పోలేదా? అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆటలో భారీ స్కోర్లు నమోదు కాలేదు.. కానీ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రం అసలైనవిందు దొరికింది. పాక్-ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠగా జరిగిన 5వ టీ20 అభిమానులకు ఉర్రుతలూగించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మెుదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్రిటీష్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 19 ఓవర్లకే 145 పరుగులకు పాక్ కుప్పకూలింది. పాక్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా.. సామ్ కరన్, డేవిడ్ విల్లీ తలా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పొయి 139 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ మెుయిన్ అలీ 37 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దాంతో 6 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్-పాక్ మధ్య 4వ టీ20.. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి, విజయానికి 10 బంతుల్లో కేవలం 5 పరుగులే కావాలి. కానీ ఇంగ్లాండ్ జట్టు 3 రన్స్ తేడాతో ఓడిపోయింది. మళ్లీ అదే సీన్ ను రిపీట్ చేస్తూ పాక్ చేతిలో 5 వ టీ20లో సైతం ఓడిపోయింది. ఇంగ్లాండ్ విజయానికి చివరి ఓవర్ లో 15 పరుగులు కావాలి.. క్రీజ్ లో అప్పటికే మెరుపులు మెరిపిస్తోన్న మెుయిన్ అలీ ఉన్నాడు. ఇంకేం విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు అందరు. కానీ తొలి మ్యాచ్ ఆడుతున్న యువ కెరటం అమీర్ జమాల్ అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగడంతో చివరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఇంగ్లాండ్ ఓటమి ఖాయం అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా గతంలో లాగే చివరి ఓవర్లో తడబడ్డ ఇంగ్లాండ్ అపజయాన్ని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ అద్బుతమైన బౌలింగ్ వేసి జమాల్ పాక్ ను గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ చూసిన అభిమానులు ఇంగ్లాండ్ జట్టుకు ఇంకా లాస్ట్ ఓవర్ భయం పోలేదు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
Nerves of steel! 🤩
Debutant Aamir Jamal stars with a remarkable last over 👏#PAKvENG | #UKSePK pic.twitter.com/tsZ1KQtg9v
— Pakistan Cricket (@TheRealPCB) September 28, 2022
Mohammad Rizwan in the current series against England:
68, 88*, 8, 88 and 63
Runs 315
Average 78.75
Strike-rate 140.62Wall steel against falling wickets!!#engvspak pic.twitter.com/fzmQxgVvI1
— Rizwan ullah (@NabeelK94045087) September 29, 2022